Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Dubbaka By-poll: దుబ్బాకలో గెలవబోతున్నాం.. కేసీఆర్ పై గర్జించిన జేజమ్మ!

    Dubbaka By-poll: త్వరలో జరగనున్న దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియామకమైన తర్వాత గురువారం తొలిసారిగా ఆమె సొంత ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు.

    news18-telugu
    Updated: October 2, 2020, 2:34 PM IST
    Dubbaka By-poll: దుబ్బాకలో గెలవబోతున్నాం.. కేసీఆర్ పై గర్జించిన జేజమ్మ!
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ కేసీఆర్ ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియామకమైన తర్వాత గురువారం తొలిసారిగా ఆమె సొంత ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. తొలుత ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆంజనేయస్వామి, అలంపూర్‌ ఆలయాలు, జమ్మిచేడులోని జమ్ములమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జోగులాంబ ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌, అర్చకులు అరుణకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం, జోగులాంబకు ప్రత్యేక పూజలు చేశారు.

    ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. స్వామి, అమ్మవారి కృప వల్లే తనకు జాతీయ స్థాయి పదవి దక్కిందన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు తెలియకుండా సీఎం కేసీఆర్‌ దాస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనకు జాతీయస్థాయి పదవి కట్టబెట్టిన మోదీ, అమిషా, నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర పుష్కర పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలు ప్రజలకు తెలియకుండా సీఎం కేసీఆర్‌ దాస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆమెకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

    ఇటీవల పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ(BJP) జాతీయ నాయకత్వం.. తెలంగాణ లో ముఖ్య నేతగా గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. తనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటానని ఆమె పార్టీ నాయకత్వానికి చెబుతూ వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పదవిని మొదటి నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ నాయకత్వం కట్టబెట్టింది.

    దీంతో డీకే అరుణకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందనే వార్తలు వినిపించాయి. అయితే ఆమెకు పార్టీ జాతీయ నాయకత్వంలో కీలక పదవి దక్కొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్‌ను ధీటుగా విమర్శించే నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణకు మంచి పదవి ఇస్తే.. ఆమె ద్వారా తెలంగాణలో పార్టీకి మంచి మైలేజీ వస్తుందని భావించిన పార్టీ నాయకత్వం.. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో చోటు కల్పించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
    Published by: Nikhil Kumar S
    First published: October 2, 2020, 2:27 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading