ఢిల్లీకి డీకే అరుణ... ఆ పదవి ఖాయం ?

డీకే అరుణకు కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడయినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 4, 2019, 7:47 PM IST
ఢిల్లీకి డీకే అరుణ... ఆ పదవి ఖాయం ?
డీకే అరుణ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా... అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపైనే చర్చ జరుగుతోంది. త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే యోచనలో ఉన్న బీజేపీ హైకమాండ్... ఇందుకోసం ఇప్పటికే కసరత్తును కూడా పూర్తి చేసింది. తాజాగా ఈ పదవి మాజీమంత్రి డీకే అరుణకు ఖాయమైందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీనిపై ఓ నిర్ణయం తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం... డీకే అరుణను ఢిల్లీకి రావాలని ఆదేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె హస్తిన బాట పట్టారని తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ దూతగా తెలంగాణకు వచ్చిన వెళ్లిన ఓ ముఖ్యనేత... రాష్ట్రంలో పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరనే దానిపై పలువురు నేతల అభిప్రాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కొందరు లక్ష్మణ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగించాలని కోరగా... మరికొందరు మాత్రం డీకే అరుణ వంటి నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే కేసీఆర్‌పై ధీటుగా పోరాటం చేస్తారని చెప్పినట్టు తెలుస్తోంది.

అందరి అభిప్రాయాలు తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం... ఫైనల్‌గా ఎవరికి ఈ ఛాన్స్ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ అంశంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని... డీకే అరుణకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని తెలుస్తోంది.First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>