Dk Aruna: ఫోన్‌లు వస్తున్నాయి.. గూగుల్‌ పే ద్వారా ఓటుకు ఐదు వేలు.. టీఆర్‌ఎస్‌పై డీకే అరుణ ఫైర్

బీజేపీ శ్రేణులతో ట్లాడుతున్న డీకే అరుణ

తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

  • Share this:
    తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రాడ్యుయేట్లకు ముఖం చూపే ధైర్యం లేక, ఫోన్లు చేసి గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చి ఆరేళ్లు అయినా నిరుద్యోగుల బతుకులు మారలేదని మండిపడ్డారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రులు నియోజకర్గం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరఫున గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాదిరిగా ఫలితాలను రాబట్టేందుకు అందరూ కృషి చేయాలని డీకే అరుణ అన్నారు. ప్రతి ఒక్కరు ప్రేమేందర్‌ రెడ్డి విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రేమేందర్ రెడ్డి అన్ని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. శాసనమండలిపై సమస్యలపై గట్టిగా గళం వినిపించాలంటే అది ప్రేమేందర్‌రెడ్డితోనే సాధ్యమని అని తెలిపారు.

    ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని.. అయితే ఆ ఓట్లు మనకే వస్తాయని అతి విశ్వాసం పనికి రాదని అన్నారు. ఓట్ల కోసం ప్రతి గ్రామానికి తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టాలన్నారు. విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధనాన్ని, అధికారాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని కార్యకర్తలకు సూచించారు.

    అలాగే ఆరేళ్లలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఏం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఎందుకు ఉద్యోగాలు రాకుండా పోయాయో సమాధానం చెప్పాలని కోరారు. రెండోసారి ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి అంటూ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులకు ఓట్లు అడిగే హక్కు, అర్హత లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రాడ్యుయేట్ ఓట్లర్లకు ముఖం చూపే ధైర్యం లేక.. ఫోన్లు చేసి గూగుల్ పే ఓటుకు ఐదు వేలు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బుతో తెలంగాణ ప్రజలను కొనవచ్చని భావిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులకు బుద్ది చెప్పేందుకు ప్రేమేందర్ ‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published: