ఓటమి భయంతోనే ముందస్తు స్థానిక ఎన్నికలు... కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్....

ఓటమి భయంతోనే ముందస్తు స్థానిక ఎన్నికలకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తప్పదని డీకే జోస్యం చెప్పారు.

news18-telugu
Updated: April 20, 2019, 5:48 PM IST
ఓటమి భయంతోనే ముందస్తు స్థానిక ఎన్నికలు... కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్....
డీకే అరుణ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 20, 2019, 5:48 PM IST
లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని బీజేపీ నేత డీకే. అరుణ జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా రానున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ముందుగా నిర్వహిస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వస్తే అసలు సంగతి బయటపడుతుందనే, భయంతోనే సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలను ముందుకు జరిపారని డీకే ఆరుణ అన్నారు. అలాగే రెవిన్యూ శాఖ విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని డీకే. అరుణ అన్నారు. అయితే రెవిన్యూ అధికారుల కన్నా టీఆర్ఎస్ నేతలనే పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.

నల్గొండలోని బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న డీకే.అరుణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని ఈ సందర్భంగా అన్నారు. అలాగే దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి బాధ్యతలు చేపడతారని అన్నారు.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...