Home /News /politics /

DISSATISFACTION IN ALL PARTIES IN THE UP ELECTIONS LEADERS WHO DO NOT DESERVE A TICKET TO SHED TEARS SNR

యూపీ ఎన్నికల్లో వాళ్లందరిది అదే ప్రాబ్లం..అందుకే వెక్కివెక్కి ఏడ్చారు

Photo Credit: Youtube

Photo Credit: Youtube

UP Elections: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల వేళ అన్నీ పార్టీలకు వాళ్ల శాపనార్ధాలు తగులుతున్నాయి. టికెట్ ఆశించిన వాళ్లందరికి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో అధిష్టానం తీరును తప్పుపడుతూ పబ్లిక్‌గా కన్నీరు పెట్టుకుంటున్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు అసంతృప్తు(Dissatisfaction)లతో పెద్ద చిక్కొచ్చి పడింది. గెలుపే లక్ష్యంగా అధికారమే పరమావధిగా భావిస్తూ అన్నీ పార్టీలు అభ్యర్దులను ఎంపిక చేసి టిక్కెట్లు ఇస్తున్నాయి. టిక్కెట్‌ ఆశించి పార్టీకి అంతో ఇంతో పనిచేసి ఖచ్చితంగా టిక్కెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా వ్యవహారం ప్రధాన పార్టీలను తెగ కలవరపెడతున్నాయి. కొందరు పార్టీలు మారుతుంటే మరికొందరు టిక్కెట్ ఆశించి భంగపడటం గెలుపు, ఓటములపై ప్రభావం చూపిస్తాయేమోనన్న ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మథుర (Mathura)నియోజకవర్గం నుంచి బీజేపీ నేత సతీష్‌కుమార్‌శర్మ (Satish kumar sharma) టిక్కెట్‌ ఆశించారు. చివరి నిమిషంలో అధిష్టానం వేరే వ్యక్తిని ప్రకటించడంతో ఆయన బోరున విలపించారు. ఐదేళ్లు పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డానని తనకు ఇలాంటి అవమానం జరుగుతుంది అనుకోలేదని బహిరంగంగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ తలనొప్పి అధికార బీజేపీకి మాత్రమే కాదు ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీకి తప్పలేదు. (Bijnor)బిజ్‌నూర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్న ఎస్పీ నేత జావెద్‌ రయిన్‌(Javed raeen)కి పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. తనకు ఇంత అన్యాయం జరుగుతుందని ఊహించలేదని..అయితే పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బరువెక్కిన హృదయంతో..
బీఎస్పీ నేత అర్షద్‌ రానా (Arshad rana)కూడా తన ఆవేదనను ప్రజలు, మీడియా సమక్షంలో బయటపెట్టారు. పార్టీ హైకమాండ్‌ తనకు టిక్కెట్ ఇస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నానని..కానీ చివరి నిమిషంలో ఎవరో కొత్త వ్యక్తులను పోటీకి దింపడం తనకు నచ్చలేదని చేతులు జోడించి మరీ ఏడ్చారు. ఖేరాఘర్‌ నుంచి బీజేపీ తరపున పోటీకి సిద్ధమైన దిగంబర్‌సింగ్‌ ధాక్రే (Digambar singh dhakre)కూడా ఈజాబితాలో ఉన్నారు. తనను పోటీకి ఎంపిక చేయకపోవడం చూస్తుంటే ఖేరాఘర్‌ ప్రజల్ని మోసం చేయడంతో సమానమని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగాలని చూస్తున్నారు.

అన్ని పార్టీలకు తప్పని తిప్పలు..
బీజేపీ, ఎస్పీ, బీఎస్పీతో పాటు కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి కన్నీటి చిత్రం కనిపించింది. ముజాఫర్‌నగర్‌ నుంచి పోటీ చేద్దామనుకున్న మెహరాజ్‌ జహన్‌ (Mehraj jahan) కాంగ్రెస్ హైకమాండ్ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. కనీసం సదర్ అసెంబ్లీ నుంచి అయినా తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ముజాఫర్‌నగర్‌లో లడ్కీ హో లడ్తీ హో అనే నినాదం విఫలమైందన్నారు ఆ మహిళనాయకురాలు. స్థానిక అభ్యర్దులు టిక్కెట్‌ కోసం ఆశ పడి భంగపడితే..పార్టీ అధినాయకత్వాలు మాత్రం విజయాన్ని దృష్టిలో పెట్టుకొనే టికెట్లు కేటాయిస్తున్నామని చెబుతున్నారు. మరి భంగపడిన వాళ్లంతా ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతారో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Assembly Election 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు