ysrcp: గుంటూరు వైసీపీలో ముదురుతున్న రచ్చ

గుంటూరు జిల్లా వైసీపీలో తీవ్రమవుతున్న విభేదాలు ఆ పార్టీలో ఆందోళనను పెంచుతున్నాయి.

news18-telugu
Updated: February 21, 2020, 12:53 PM IST
ysrcp: గుంటూరు వైసీపీలో ముదురుతున్న రచ్చ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైసీపీలో గ్రూపు రాజకీయాలు రోజుకు రోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జిల్లాలోని చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ మరిది గోపినాధ్‌పై దుండగులు దాడికి తెగబడటం చర్చనీయాంశంగా మారింది. గురువారం అర్ధరాత్రి ఆయన కారులో వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. గోపినాధ్‌కు కూడా గాయాలయ్యాయి. విడుదల వారి ప్రభను కోటప్పకొండలో వదిలి ఇంటికి వచ్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు వర్గమే తమపై ఈ దాడికి పాల్పడిందనే ఎమ్మెల్యే వర్గం అనుమానిస్తోంది. నిన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు రాక సందర్భంగా ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన చేపట్టడం... అది కాస్తా ఉద్రిక్తతగా మారడం తెలిసిందే. దీంతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్యే రజినీ మరిదిపై దాడి జరగడం గుంటూరు జిల్లా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ అధినాయకత్వం సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.






First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు