Home /News /politics /

DISHA FATHER RESPONSE ON ANDHRA PRADESH DISHA ACT 2019 MS

దిశా చట్టంపై దిశా తండ్రి స్పందన.. జగన్‌కు ధన్యవాదాలు..

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టంపై దిశా తండ్రి స్పందించారు.

    మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టంపై దిశా తండ్రి స్పందించారు. తమ కుమార్తె పేరిట చట్టం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దిశా చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే చట్టం అమలులో కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. కాగా, దిశా చట్టానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం అత్యాచార కేసుల్లో విచారణను ప్రత్యేక కోర్టుల ద్వారా కేవలం 21 రోజుల్లో పూర్తి చేసి శిక్షలు విధిస్తారు. వారం రోజుల్లో దర్యాప్తు,14 రోజుల్లో విచారణ ప్రక్రియ పూర్తవతుంది. నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టింగ్స్ పెడితే రెండు నుంచి నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Disa Rape and Murder, Disha Act

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు