Home /News /politics /

DISHA ACT AND ESTABLISHING PUBLIC TRANSPORTATION DEPARTMENT AP CABINET KEY DECISIONS MS

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే : దిశా చట్టం,ప్రజా రవాణా శాఖ ఏర్పాటు

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

'ఏపీ క్రమినల్ లా'కి సవరణలు చేసి దిశా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. మహిళలపై అత్యాచారం,హత్య కేసుల్లో 21 రోజుల్లోగా నిందితులకు శిక్ష పడేలా చేయనున్నారు.

    ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి అందులో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 'ఏపీ క్రమినల్ లా'కి సవరణలు చేసి దిశా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. మహిళలపై అత్యాచారం,హత్య కేసుల్లో 21 రోజుల్లోగా నిందితులకు శిక్ష పడేలా చేయనున్నారు. ఏడు రోజుల్లో పోలీసుల దర్యాప్తు,14 రోజుల్లో వాదనలు ముగించి కోర్టు తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసంప్రతీ జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

    చిన్నారులను లైంగికంగా వేధిస్తే 14 ఏళ్లు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడేలా చట్ట సవరణకు ఆమోద ముద్ర తెలిపింది. అసభ్య పోస్టింగ్స్‌తో మొదటిసారి బుక్ అయితే రెండేళ్లు,రెండోసారి బుక్ అయితే నాలుగేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టాల మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
    ఇక వార్డు,గ్రామ వాలంటీర్ల కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.అలాగే కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేత,రాజధానిలో థర్డ్ పార్టీకి కేటాయించిన భూముల ప్లాట్ల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ భూములను తిరిగి అసైన్డ్ భూముల యజమానులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Disa Rape and Murder, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు