• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • DISCUSSIONS HAVE STARTED IN DELHI ON WHO SHOULD BE GIVEN THE POST OF TELANGANA PCC CHIEF VB

TPCC: తెరపైకి టీపీసీసీ వ్యవహారం.. రేసులో ఆ ఇద్దరు నేతలు.. త్వరలో క్లారిటీ..

ప్రతీకాత్మక చిత్రం

TPCC: తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఇటీవల సాగర్ ఉప ఎన్నికతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో దీనిపై ఏఐసీసీ ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

  • Share this:
    టీపీసీసీ చీఫ్ వ్యవహారం ఢిల్లీలో మళ్లీ మొదలైంది. గత కొన్ని రోజులు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో చర్చ జరగ్గా.. తాజాగా ఈ వ్యవహారంలో మరిన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఇటీవల జరగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు ఐదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనుండటంతో ఇక స్థానిక అంశాలపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నాయకుల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కారానికి సీనియర్‌ నేతలను రంగంలోకి దింపింది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగునున్నాయి. కావునా ఖాళీగా ఉన్న పీసీసీ ఛీప్ పదవులను భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగానే తెలంగాణలో కూడా పీసీసీని నియమించేందుకు సిద్దమైంది.

    దీనిపై సాగర్ ఉప ఎన్నిక సమయంలో పీసీసీ చీఫ్ పదవిపై ప్రకటన చేయవద్దని మాజీ మంత్రి జానారెడ్డి కోరడంతో అప్పుడు వాయిదా పడింది. ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడిని నియమించే సంకేతాలు వినిపిస్తున్నాయిన రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

    జానారెడ్డి పేరు కూడా వినిపించినా.. ఇటీవలే జరిగిన సాగర్ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు కూడా పీసీసీ రేసులో వినిపించింది. ఇలా అనేకమంది సీనియర్ నాయకుల పేర్లను అధిష్టానం పరిశీలించింది. మరి చివరి నిమిషంలో పీసీసీ ఎవరకి వరిస్తుందో చూడాలి.
    Published by:Veera Babu
    First published: