Home /News /politics /

DISCUSSION ON THE SELECTION OF MANIPUR AND GOA CMS AT AMIT SHAH RESIDENCE SNR

DELHI: ఎవరో ఆ ఇద్దరు సీఎంలు..గోవా, మణిపూర్‌లో మార్పు తప్పదా..?

(సీఎంల ఎంపికపై చర్చ)

(సీఎంల ఎంపికపై చర్చ)

DELHI: గోవా,మణిపూర్‌లో ఎవర్ని ముఖ్యమంత్రిగా నియమించాలనే అంశంపై బీజేపీ హైకమాండ్‌ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రానికి ఇద్దరు చొప్పున బలమైన నేతల పేర్లను పరిగణలోకి తీసుకున్న హైకమాండ్..మరికొన్ని గంటల్లోనే వారి పేర్లను ప్రకటించే ఛాన్సు ఉందని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

ఇంకా చదవండి ...
నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ(Bjp)కి గోవా(Goa), మణిపూర్‌(Manipur)లో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. శనివారం (Saturday)రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah )నివాసంలో ఇదే అంశంపై విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. సుదీర్ఘ సమయం పాటు సాగిన సమావేశంలో గోవా, మణిపూర్‌ రాష్ట్రాలకు ఎవర్ని ముఖ్యమంత్రిగా నియమించాలనే అంశంపై అగ్రస్థాయి నేతలు చర్చించారు. ఉత్తరాధిన హోలీ వరకు మంచి రోజులు కావని భావించిన బీజేపీ హైకమాండ్ పండుగ ముగియడంతో ఈప్రక్రియను వేగవంతం చేసినట్లుగా కనిపిస్తోంది. మణిపూర్, గోవా రెండింటిలోనూ ప్రస్తుత ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి మరోసారి సీఎం అవకాశం దక్కుతుందనే సంకేతాలు అగ్రనాయకత్వం ఇవ్వకపోవడంతో ..కొత్త వ్యక్తులకు ఆ పదవులు వరిస్తాయానే అనే చర్చ కూడా జోరుగా జరుగుతున్నట్లు సమాచారం. సీఎం స్థానం బలమైనది కాబట్టి అర్హత కలిగిన, రేసులో ఉన్న వాళ్లను మాత్రమే అధినాయకత్వం సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్‌ వ్యవహారం చూస్తుంటే గోవా, మణిపూర్‌లో కీలకపరిణామాలు చోటుచేసుకుంటాయనే ఊహాగానాలు ఉన్నాయి. గోవా, మణిపూర్‌లో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఎవర్ని ముఖ్యమంత్రులుగా చేస్తే బాగుంటుందనే విషయంపై నాయకుల సూచనలు, సలహాలు తీసుకునేందుకే అమిత్‌షా నివాసంలో ప్రత్యేక సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా(JP NADDA), జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh)హాజరయ్యారు. ముఖ్యంగా అధినాయకత్వంతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించడం జరిగింది.

సీఎంల ఎంపికపై కసరత్తు..
గోవా విషయానికి వచ్చే సరికి సీఎం ప్రమోద్ సావంత్‌తో పాటు ఎమ్మెల్యే విశ్వజిత్‌ రాణే భేటీలో పాల్గొన్ారు. గోవా సీఎం రేసులో ఉన్నది కూడా వీళ్లిద్దరేనని సమాచారం. గోవా సీఎంగా నెక్స్ట్ ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారో కూడా ఇదే సమావేశంలో నిర్ణయించి ..రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం.

(గోవా, మణిపూర్‌ సీఎంల ఎంపికపై కసరత్తు)


మరికొన్ని గంటల్లో ..
అటు మణిపూర్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి అభ్యర్దిని ఎవర్ని ఎంపిక చేస్తే బాగుంటుందనే విషయంపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత సీఎం ఎన్ బీరెన్ సింగ్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యే టి బిశ్వజిత్ సింగ్‌ని ఈ సమావేశానికి ఆహ్వానించడం చూస్తుంటే ఇక్కడ కూడా అభ్యర్ధి మార్పు తప్పదనే సంకేతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార తేదీలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతల్ని పిలిపించి సీఎం పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. షా నివాసంలో జరిగిన ఈ కీలక సమావేశానికి మణిపూర్‌ మాజీ అసెంబ్లీ స్పీకర్ యుమ్నామ్‌ ఖేమ్‌చంద్‌ కూడా హాజరైనట్లుగా సమాచారం. మణిపూర్‌ విషయంలో పరిశీలకురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్‌తో పాటు సీఎం పదవి ఆశిస్తున్న ఆశావాహులు సైతం ఆదివారం మణిపూర్‌కి వెళ్తారు. త్వరలోనే సీఎం క్యాండిడెట్‌ పేరు ప్రకటిస్తారనే బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మణిపూర్‌ సీఎం రేసులో ఇద్దరు యమాయమిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం పదవి దక్కని నేతకు అంతే ప్రాధాన్యత కలిగిన పదవిని కట్టబెడతారనే పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. చూడాలి అటు గోవా ఇటు మణిపూర్‌లో ఇద్దరేసి వ్యక్తుల్ని పిలిపించిన బీజేపీ హైకమాండ్ పాత వాళ్లను ఎంపిక చేస్తుందా..లేక కొత్త వాళ్లను సీఎంలుగా చేసి పాత వాళ్లకు వేరే పదవులు అప్పగిస్తుందో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Amit Shah, Bjp, Delhi, Goa, Manipur

తదుపరి వార్తలు