చిదంబరం అరెస్టుపై వర్మ రియాక్షన్... ఏమన్నాడంటే...

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్‌పై తనదైన స్టయిల్లో స్పందించిన రామ్‌గోపాల్ వర్మ... చిదంబరం అరెస్ట్ రాజ్యాంగం అమలుకు పెద్ద నిదర్శమని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: August 22, 2019, 12:27 PM IST
చిదంబరం అరెస్టుపై వర్మ రియాక్షన్... ఏమన్నాడంటే...
చిదంబరం, వర్మ
  • Share this:
అనేక అంశాలపై తనదై శైలిలో స్పందించే వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ... తాజాగా మరో అంశంపై ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యాడు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్‌పై తనదైన స్టయిల్లో స్పందించిన రామ్‌గోపాల్ వర్మ... చిదంబరం అరెస్ట్ రాజ్యాంగం అమలుకు పెద్ద నిదర్శమని వ్యాఖ్యానించాడు. చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఆఫీసులోనే ప్రస్తుతం కస్టడీలో ఉండటాన్ని వర్మ ప్రస్తావించాడు. ఇంతకంటే పెద్ద వ్యంగ్యం ఏముంటుందని వ్యాఖ్యానించాడు. మోదీ హయాంలో చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదని మరోసారి రుజువైందని వర్మ అన్నాడు.

బుధవారం రాత్రి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. రాత్రి 8.50 గంటలకు సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వచ్చారు. సుమారు గంట పాటు చర్చలు జరిగాయి. రాత్రి 9.45 గంటలకు చిదంబరాన్ని అరెస్ట్ చేసి తమ కారులో తీసుకెళ్లారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>