చంద్రబాబు తోడల్లుడిని జగన్ పట్టించుకుంటారా... దగ్గుబాటికి ప్రాధాన్యత ఇస్తారా ?

దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగి... విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు తోడల్లుడు, సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు... అనూహ్యంగా మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది.

news18-telugu
Updated: May 31, 2019, 7:14 PM IST
చంద్రబాబు తోడల్లుడిని జగన్ పట్టించుకుంటారా... దగ్గుబాటికి ప్రాధాన్యత ఇస్తారా ?
వైఎస్ జగన్
  • Share this:
రాజకీయాల్లో గెలుపోటములు కీలక పాత్ర పోషిస్తుంటాయి. వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉన్నా... వారు సాధించిన ఫలితాలే అందరికీ కనిపిస్తుంటాయి. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగింది. దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగి... విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు తోడల్లుడు, సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు... అనూహ్యంగా మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. కుమారుడి అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో... జగన్ సూచన మేరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పర్చూరులో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.

గట్టి పోటీ ఉన్నా ఆయన గట్టెక్కుతారని... వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాయమనే వార్తలు కూడా రాజకీయవర్గాల్లో చక్కర్లు కొట్టాయి. చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు దగ్గుబాటి స్పీకర్ చేయాలని జగన్ నిర్ణయించుకున్నారనే ప్రచారం గట్టిగా వినిపించింది. అయితే ఏపీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా... పర్చూరులో మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓటమిని పలకరించింది. దీంతో ఆయనపై వచ్చిన ఊహాగానాలకు ఒక్కసారిగా తెరపడింది.

అయితే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రీయాశీల రాజకీయాల్లో మళ్లీ కీలకమవుతారా ? పార్టీలో లేదా ప్రభుత్వంలో ఆయన స్థాయి తగ్గ పదవిని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇస్తారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తానికి కుమారుడు హితేష్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉంటుందనేది రానున్న రోజుల్లో తేలనుంది.First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>