కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి ఘటనపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాకతాళీయంగా అన్నారో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు గానీ పుల్వామా దాడిని 'ప్రమాద ఘటన'గా అభివర్ణించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసి 40మంది భారత జవాన్లను బలి తీసుకుంటే దాన్ని ప్రమాదంగా అభివర్ణించడం వివాదాస్పదమవుతోంది.
పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట‌్‌పై భారత్ జరిపిన దాడి గురించి ట్విట్టర్‌లో దిగ్విజయ్ పలు అనుమానాలు లేవనెత్తారు. బాలాకోట్ దాడిపై ఇంటర్నేషనల్ మీడియా అనుమానాలు లేవనెత్తిందని, ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ లేదా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికైనా దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. బాలాకోట్ దాడిలో అసలెంత మంది చనిపోయారో లెక్క చెప్పాలన్నారు. బాలాకోట్‌పై భారత వైమానిక దాడిని మీరు, మీ మంత్రులు సాధించిన విజయంగా చూడటం భద్రతా బలగాలను అవమానించడమేనని మోదీని ఉద్దేశించి విమర్శించారు.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్‌కు ఏమైందని ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంటుతో ఆడుకోవడం.. ఆర్మీ సమాచారాన్ని కూడా తోసిపుచ్చడం ఏంటన్నారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ సొంత సైన్యాన్ని నమ్మని ప్రజలంటూ ఉండరని, అలాంటిది కాంగ్రెస్ మాత్రం అనుమానాలను లేవనెత్తుతోందని విమర్శించారు.
Union Minister P Javadekar on Digvijaya Singh terms #PulwamaAttack an ‘accident’: Congress ko kya hogya hai?Desh ki jan bhawna se ek dum ulti baat karte hain,sena ki jankari ko jhutla rahe hain.Aisa kisi lok tantra desh mein nahi hota jahan sena par hi avishwas darshaya jata hai. pic.twitter.com/j3AX2X8pqr
— ANI (@ANI) March 5, 2019
ఇది కూడా చదవండి : బాలాకోట్‌లో ఏరిపారేసింది ఉగ్రవాదులనా లేక చెట్లనా? : మోదీపై సిద్దూ సెటైర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digvijaya Singh, Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir security, Narendra modi, Pakistan, Pulwama Terror Attack