Digvijaya Singh: అమిత్ షా చేసిన సాయాన్ని మరిచిపోలేను.. ఆ విషయాలను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్ (ఫైల్ ఫొటో)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒకరు. కానీ ఆయన తన శైలికి భిన్నంగా.. అమిత్‌షాపై ప్రశంసల వర్షం కురిపించారు.

 • Share this:
  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒకరు. కానీ ఆయన తన శైలికి భిన్నంగా.. అమిత్‌షాపై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు నాలుగేళ్ల కిందట అమిత్ షా, ఆరెస్సెస్ కార్యకర్తలు ఏ విధంగా సహాయం చేశారో వెల్లడించారు. తాను నర్మద పరిక్రమ (Narmada Parikrama) యాత్ర చేసినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని గుర్తుచేసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ 2017లో, తన భార్య అమృతతో కలిసి నర్మద తీరంలో యాత్ర చేపట్టిన సంగతి తెలసిందే. ఇక, తాజాగా తన దీర్ఘకాల సహచరుడు ఓపీ శర్మ రాసిన ‘నర్మద పాఠిక్’ (Narmada Ke Pathik) పుస్తకం ప్రారంభోత్సవం సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

  ‘ఒకసారి.. మేము గుజరాత్‌లోని మా గమ్యస్థానానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నాము. అది అటవీ ప్రాంతం కావడంతో ముందుకు సాగడానికి మార్గం లేదు. రాత్రిపూట బస చేయడానికి ఎలాంటి సదుపాయం లేదు. అప్పుడు ఓ అటవీ అధికారి వచ్చారు. అతను నాతో చెప్పిన మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అతడు నాతో అమిత్ షా (Amit Shah) మాకు పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ అమిత్ షా పంపారని చెప్పారు. అప్పుడు గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి నేను వారికి పెద్ద విమర్శకుడిని. అయినప్పటికీ యాత్రలో మేం ఎలాంటి ఇబ్బంది పడకూడదని అమిత్ షా చూశారు. పర్వతాల మీదుగా మాకు దారి చూపెట్టబడింది. అంతేకాదు, మా అందరికీ ఆహారం సమకూర్చారు’అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

  చీర కట్టుకుని వచ్చిన మహిళను అనుమతించని రెస్టారెంట్.. గట్టి షాక్ ఇచ్చిన అధికారులు.. ఇప్పుడా రెస్టారెంట్ పరిస్థితి ఏమిటంటే..

  అయితే ఈ రోజు వరకు తాను అమిత్ షాను కలవలేదని చెప్పిన దిగ్విజయ్ సింగ్.. ఆయనకు కొన్ని మార్గాల ద్వారా కృతజ్ఞతలు తెలియజేశానని చెప్పారు. రాజకీయ సమన్వయం, సర్దుబాటు, స్నేహానికి రాజకీయాలు, భావజాలంతో సంబంధం లేదని చెప్పడానికి ఇది ఒక ఊదాహరణ అని ఆయన అన్నారు. ఆరెస్సెస్‌ను (RSS) తాను తీవ్రంగా విమర్శించినప్పటికీ.. తన యాత్రలో సంఘ్ కార్యకర్తలు తనను కలుస్తూనే ఉండేవారని చెప్పారు.

  Honeymoon: పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్‌కు వెళ్లారు.. అక్కడ అలా జరగడంతో మైండ్ బ్లాక్.. చివరకు..

  ‘ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారని నేను వారిని అడిగాను. అప్పుడు వారు నన్ను కలవమని ఆదేశాలు ఉన్నట్టుగా చెప్పారు. తాము భరూచ్ ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు ఆరెస్సెస్ కార్యకర్తలు తమ బృందానికి మాంఝీ సమాజ్ ధర్మశాలలో బస ఏర్పాటు చేశారు. వారు బస చేసిన హాలులో ఆరెస్సెస్ ప్రముఖులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar), మాధవరావ్ సదాశివరావ్ గోల్వాల్కర్ (Madhavrao Sadashivrao Golwalkar) తదితరుల ఫొటోలు ఉన్నాయి. మతం, రాజకీయాలు భిన్నమైనవని ప్రజలకు తెలియజేయడానికి తాను ఈ విషయం చెబుతున్నాను. నా యాత్రలో అందరి నుంచి సహాయం తీసుకున్నాను. బీజేపీ యువజన విభాగం నాయకుడు, మరో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు నాయకులు నా సముహంలో ఉన్నారు. వారిది నా నర్మద కుటుంబం నుంచి విడదీయరాని బంధం’అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

  ఆధ్యాత్మిక నాయకుడు దద్దాజీ తన అనుచరుడు, నటుడు అశుతోష్ రాణాను(Ashutosh Rana) బార్మన్ ఘాట్ వద్ద ‘భండారా’ (కమ్యూనిటీ విందు) కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని కూడా దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. దిగ్విజయ సింగ్ భార్య అమ్రిత(Amrita) కూడా యాత్రలో తన అనుభవాలను వివరించారు. నర్మద నది వెంట పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: