• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • DIGVIJAY SINGH A TRUE HINDU WILL WIN AGAINST BJP IN BHOPAL OF MADHYA PRADESH SAYS HIS SON JAIVARDHAN AK

మా నాన్న నిజమైన హిందువు... బలిపశువు కాదు... కాంగ్రెస్ నేత కుమారుడి వ్యాఖ్య

మా నాన్న నిజమైన హిందువు... బలిపశువు కాదు... కాంగ్రెస్ నేత కుమారుడి వ్యాఖ్య

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (ఫైల్)

30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న భోపాల్‌ను దిగ్విజయ్ సింగ్‌ను బరిలోకి దింపడం ద్వారా కాంగ్రెస వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కొందరంటే... ఆయనను బలిపశువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

  • Share this:
    ఒకప్పుడు రాహుల్ గాంధీ కోటరీలో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను కొంతకాలంగా ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదనే ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా ఆయన కాంగ్రెస్ తరపున మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి పోటీకి సిద్ధమవడం అందరి దృష్టికి ఆకర్షించింది. 30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న భోపాల్‌ను దిగ్విజయ్ సింగ్‌ను బరిలోకి దింపడం ద్వారా కాంగ్రెస వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కొందరంటే... ఆయనను బలిపశువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఆయన కుమారుడు, మధ్యప్రదేశ్ మంత్రి జైవర్ధన్ సింగ్ స్పందించారు. భోపాల్ నుంచి బీజేపీ తరపున ఎవరు పోటీ చేసినా... గెలుపు మాత్రం తన తండ్రి దిగ్విజయ్ సింగ్‌దే అని జైవర్ధన్ సింగ్ అన్నారు.

    తన తండ్రిని నిజమైన హిందువుగా పేర్కొన్న జైవర్ధన్ సింగ్... తాను ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పదేళ్ల కాలంలోజరిగిన అభివృద్ధి ఆధారంగానే ఆయన పోటీ చేస్తున్నారని అన్నారు. దిగ్విజయ్ సింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ తరపున తన తండ్రిపై పోటీ చేయబోయేది ఎవరనే విషయం తెలుసుకోవడానికి తాము కూడా ఎదురుచూస్తున్నామని జైవర్థన్ తెలిపారు. సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తన తండ్రి నిజమైన హిందువు అని వ్యాఖ్యానించిన ఆయన తనయుడు... పార్టీ ఏది చెబితే అది చేసే వ్యక్తి దిగ్విజయ్ అని అన్నారు. భోపాల్ న్యూట్రల్ సీటు అని వ్యాఖ్యానించిన జైవర్ధన్... ఆయన బలిపశువు అవుతారనే వాదనను తోసిపుచ్చారు.

    30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా కొనసాగుతున్న భోపాల్ సీటు నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తుండటంతో... తమ పార్టీ తరపున ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు పదే పదే ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్ ప్రస్తావనను తీసుకురావడంపై జైవర్ధన్ మండిపడ్డారు. బీజేపీ నేతలకు పాకిస్థాన్ అంటే అంతగా ఇష్టం ఉంటే అక్కడి వెళ్లిపోవచ్చని అన్నారు. వాళ్లు దిగ్విజయ్ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మొదట భోపాల్ నుంచి అలోక్ శర్మ, సిట్టింగ్ ఎంపీ అలోక్ సంజర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వీడీ శర్మ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించడంతో మాజీ సీఎం శివ్ రాజ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది.




    First published: