వైసీపీలో వింత పరిస్థితి... ఓ వైపు గెలుపు ధీమా... మరోవైపు ఓటమి టెన్షన్

ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ఎంత ధీమాగా ఉందో... అంతే స్థాయిలో టెన్షన్ కూడా పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇందుకు 2014 ఎన్నికల ఫలితాలే కారణమనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: April 17, 2019, 3:00 PM IST
వైసీపీలో వింత పరిస్థితి... ఓ వైపు గెలుపు ధీమా... మరోవైపు ఓటమి టెన్షన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయం తేలియాలంటే... ఫలితాలు వెలువడే మే 23 వరకు ఆగాల్సిందే. అప్పటివరకు ఫలితాలపై అంచనాలు వేసుకోవడం తప్ప రాజకీయపార్టీలు చేయగలిగింది ఏమీ ఉండదు. అయితే ఈసారి ఏపీలో అధికారం వైసీపీదే అని ఎన్నికలకు ముందు అనేక సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం... ఈసారి గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు బైబై చెప్పేశారని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మరోసారి ఆరోపణలు గుప్పించారు.

అయితే ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ఎంత ధీమాగా ఉందో... అంతే స్థాయిలో టెన్షన్ కూడా పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం 2014 ఎన్నికల ఫలితాలే. 2014 ఎన్నికలకు ముందు సైతం వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. కానీ ఫలితాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఏపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ... అధికారానికి ఆమడ దూరంలో నిలిచింది.

ఓట్ల విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య తేడా స్వల్పంగానే ఉన్నా... సీట్ల విషయంలో మాత్రం రెండు పార్టీల మధ్య భారీ తేడా రావడంతో... వైసీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఈసారి కచ్చితంగా గెలుపు తమదే అని భావిస్తున్న వైసీపీ నేతలను 2014 ఫలితాలు ఒకింత టెన్షన్ పెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఫలితాలు వచ్చి పూర్తిస్థాయిలో గెలిచేంతవరకు అర్భాటపు ప్రకటనలు చేయొద్దని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
First published: April 17, 2019, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading