హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణకు మరింత సమయం పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కుదిరితే నవంబర్ లేదా జనవరిలో ఈ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార వేడి కాస్త తగ్గినట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, నేతలు హుజూరాబాద్‌పై ఫోకస్ తగ్గించి మిగతా అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుందని చాలామంది చర్చించుకుంటున్నారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కారణంగా టీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి హరీశ్ రావు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతాం అన్నది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావును బరిలోకి దించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యత మొత్తం సీఎం కేసీఆర్ హరీశ్ రావుకే అప్పగించినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే హరీశ్ రావు సైతం తన మెజార్టీ సమయానికి హుజూరాబాద్ నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు. అక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలను కలుస్తూ.. బీజేపీ, ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడటం వల్ల మంత్రి హరీశ్ రావుకు మరింత శ్రమ పెరిగే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. సాధ్యమైనంత తొందరగా ఈ ఉప ఎన్నిక జరిగి ఉంటే.. ఆయనకు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టే సమయం తగ్గి ఉండేదనే వాదన వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు ఉప ఎన్నిక జరిగేంతవరకు హరీశ్ రావు హుజూరాబాద్‌పై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉందని అభిప్రాయపడుతున్నారు. తన గెలుపు కోసం ఈటల రాజేందర్ ఏ రకంగా అయితే పని చేస్తున్నారో.. ఆయనను ఓడించేందుకు హరీశ్ రావు కూడా అంతే తీవ్రంగా ప్రయత్నించాల్సి ఉంటుందనే చర్చ సాగుతోంది. మరోవైపు ఈ ఉప ఎన్నిక కొంతకాలం వాయిదా పడటం వల్ల హరీశ్ రావుకు మేలు జరిగే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.
KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..
kiara advani: కియారా అద్వానీలా ఉన్న యువతి.. అట్రాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరామె..
హుజూరాబాద్‌లో గెలుపు వ్యూహాలను తనదైన స్టయిల్లో రచిస్తున్న హరీశ్ రావు.. ఈ సమయాన్ని వినియోగించుకుని ఈటల రాజేందర్‌కు చెక్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మరికొందరి వాదన. హరీశ్ రావు పనితీరు కూడా ఇదే రకంగా ఉందని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కొంతకాలం వాయిదా పడటం అనేది హరీశ్ రావుకు కలిసొస్తుందా లేక ఇబ్బందిగా మారుతుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Etela rajender, Harish Rao, Huzurabad By-election 2021, Telangana, Trs