విజయవాడ టీడీపీలో లుకలుకలు.. పార్టీలోకి విచ్ఛిన్నకర శక్తులు వచ్చాయన్న ముఖ్యనేత

Vijayawada News: ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నానని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన నెట్టెం రఘురామ్ అన్నారు. 35 సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 28, 2020, 2:42 PM IST
విజయవాడ టీడీపీలో లుకలుకలు.. పార్టీలోకి విచ్ఛిన్నకర శక్తులు వచ్చాయన్న ముఖ్యనేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. 22 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా.. తనపై ఉన్న కేసుల గురించి జగన్ మాట్లాడుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని అన్నారు. విద్యుత్ మీటర్లు రైతులకు భారం కానున్నాయని వ్యాఖ్యానించారు. 25 పార్లమెంట్ స్థానాలకు ఒక్కో అధ్యక్షుడిని నియమించి, పార్టీని ముందుకు తీసుకువెళ్లేలా చంద్రబాబు ముందడుగు వేశారని అన్నారు.

కృష్ణా జిల్లా టీడీపీ కంచుకోట.కాని కొన్ని కారణాలతో పార్టీ బలహీన పడిందని.. మళ్లీ కృష్ణా జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నానని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన నెట్టెం రఘురామ్ అన్నారు. 35 సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నానని వ్యాఖ్యానించారు. పార్టీలో కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని...అందులో భాగంగా పార్టీ దెబ్బతిందని ఆయన కామెంట్ చేశారు.

2024 ఎన్నికలు కానీ ఇంకా ముందు ఎన్నికలు జరిగినా విజయవాడ పార్లమెంట్‌లో టీడీపీని గెలిపించుకుంటామని నెట్టెం రఘురామ్ అన్నారు. విజయవాడ పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాలపై తనకు అవగాహన ఉందని తెలిపారు. 7 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. వైసీపీ పాలన ప్రజలు వంచించబడ్డారని వివరించారు. టీడీపీ వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి అనే విప్లవం వచ్చిందని నెట్టెం రఘురామ్ అన్నారు. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

అయితే విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన నెట్టెం రఘురామ్ పార్టీలో కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని...అందులో భాగంగా పార్టీ దెబ్బతిందని ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడ టీడీపీలో పలు గ్రూపులు ఉన్నాయని.. దేవినేని ఉమ, బుద్దా వెంకన్న వంటి నేతలను టార్గెట్ చేస్తూ నెట్టెం రఘురామ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నెట్టెం రఘురామ్ కొంతమంది నేతలను టార్గెట్ చేసినట్టుగా వ్యాఖ్యలు చేయడంలో.. ఆయన అందరినీ కలుపుకుని ముందుకు వెళతారా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 28, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading