విజనరీ లీడర్‌కు పాయిజన్‌ లీడర్‌కు తేడా అదే : లోకేశ్

పై రాష్ట్రాల నుండి ఎంత వరద వచ్చినా ఆఖరికి రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి.. పట్టిసీమ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు లోకేశ్. పనికిరాని పట్టిసీమ అన్నవారే.. నేడు మళ్లీ మోటార్లు ఆన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: November 10, 2019, 3:51 PM IST
విజనరీ లీడర్‌కు పాయిజన్‌ లీడర్‌కు తేడా అదే : లోకేశ్
నారా లోకేష్ (File)
  • Share this:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. విజనరీ లీడర్‌కి,పాయిజన్ లీడర్‌కి తేడా ఏంటో తెలుసా? అంటూ సెటైర్స్ వేశారు. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలా చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఆలోచనలో నుంచి పుట్టినదే పట్టిసీమ అన్నారు. ఇక ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందుచూపు లేక వరదలు వచ్చినా.. ఆ నీటిని వినియోగించుకోలేక సముద్రం పాలుచేస్తున్నారని మండిపడ్డారు. పై రాష్ట్రాల నుండి ఎంత వరద వచ్చినా ఆఖరికి రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి.. పట్టిసీమ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. పనికిరాని పట్టిసీమ అన్నవారే.. నేడు మళ్లీ మోటార్లు ఆన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

కాగా,పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు మోటార్లను శనివారం ఆన్ చేశారు. గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. అయితే సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు లేని కారణంగా మోటార్లను నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది కృష్ణా జిల్లాకు 50టీఎంసీలను మాత్రమే తరలించే అవకాశం ఉంది. ఏటా జూన్-డిసెంబర్ కాలంలో 90టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. అయితే ముందుచూపు లేని జగన్ సర్కార్.. మోటార్లను ఆఫ్ చేయడం వల్లే జిల్లాకు తరలించాల్సిన నీటిలో కోత పడుతోందని లోకేశ్ విమర్శిస్తున్నారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading