అమరావతిపై జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిందా?

Amaravathi | రాజధానిలో ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయడంతో పాటు కొత్తగా ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టవద్దని, ఒప్పందాలు చేసుకోవద్దని వైసీపీ సర్కారు భావించినట్టు కనిపిస్తుంది.

news18-telugu
Updated: July 11, 2019, 5:48 PM IST
అమరావతిపై జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిందా?
అమరావతి ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందా ? గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రాజధానిని తాము ఎందుకు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందా ? అందుకు ఆర్ధిక కారణాలను సాకుగా చూపుతోందా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజధాని వాసులను కలవరపెడుతున్నాయి. కిలో మీటర్ కు రూ.32 కోట్లు వెచ్చించి రాజధాని నిర్మించే పరిస్ధితుల్లో మనం లేమంటూ ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆర్ధికశాఖపై శ్వేతపత్రం విడుదల సందర్బంగా చేసిన వ్యాఖ్యలు సందేహాలు రేకెత్తిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో కీలకమైన నిర్మాణ పనులను నిలిపేశారన్న వార్తల నేపథ్యంలో ఆర్ధికమంత్రి చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకమంటూ ఇన్నాళ్లూ టీడీపీ చేసిన ప్రచారాన్ని నిజం చేసేలా ఆర్ధికమంత్రి బుగ్గన వ్యాఖ్యలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ప్రాధాన్య రంగాలను వదిలిపెట్టి రాజధానిపై పెట్టే ఖర్చు వృథా అవుతుందనే భావన వచ్చేలా ఆర్ధికమంత్రి వ్యాఖ్యానించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Amaravathi, Amaravathi Iconic bridge, Amaravathi bridge, Amaravathi Iconic bridge foundation, Chandrababu Naidu lays foundation to Amaravathi Iconic bridge, Specialities of Amaravathi Iconic Bridge, అమరావతి ఐకానిక్ బ్రిడ్జి, అమరావతి టెంపుల్, అమరావతి ఐకానిక్ బ్రిడ్జి ప్రత్యేకతలు, అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన,
చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్మించాలని భావించిన ఐకానిక్ బ్రిడ్జి నమూనా


ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడానికి ముందే కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కీలక ప్రాంతాల్లో ఉన్న భూములను టీడీపీ అధినేత చంద్రబాబు తన బినామీలతో కొనిపించారనే విమర్శలు ఉన్నాయి. దీంతోపాటు రాజధాని భూ కేటాయింపుల్లో భారీఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ నేతలు పుస్తకాలు సైతం ప్రచురించారు. రాజధాని కోసం రైతుల భూములను అన్యాయంగా లాక్కున్నారన్న ప్రచారాన్ని వైసీపీ బలంగా చేసింది. దీంతో సహజంగానే రాజధాని అమరావతి నిర్మాణానికి వైసీపీ వ్యతిరేకమన్న ప్రచారాన్ని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. రాజధాని అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి వైసీపీ నేతలు రాకపోవడం, గత ప్రభుత్వంలో రాజధాని ఎమ్మెల్యేల్లో మంగళగిరి మినహా మిగిలిన చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉండటం వంటి కారణాలతో వైసీపీకి అమరావతిపై పెద్దగా ఆసక్తి లేదనే వాదన సాగింది.

వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోతుందనే ప్రచారాన్ని సైతం టీడీపీ గత ఎన్నికల్లో సాగించింది. అయినా ఇక్కడి ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి.ap cm chandrababu naidu, ntr statue, cm chandra babu, chandrababu naidu, ap cm chandrababu, cm chandrababu naidu, ntr statue in ap capital, ntr statue in amaravathi, ఎన్టీఆర్ విగ్రహం ఏపీ వార్తలు, అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించాక, దేశంలో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్నది అక్కడికేనని తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టవర్లు, విగ్రహాల టైమ్ నడుస్తోంది. ఏపీలో కూడా తెలుగు జాతికి ఆదర్శ నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మెమోరియల్‌ను అద్భుతంగా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేయబోతున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఎల్‌అండ్‌టీకి చెందిన డిజైన్స్‌ అసోసియేట్స్‌ రూపొందించిన ఆకృతుల రూపురేఖల్ని వివరంగా తెలుసుకున్నారు. 32 మీటర్ల (105 అడుగులు) ఎత్తైన అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పా టు చెయ్యాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో విగ్రహ నిర్మాణానికి రూ.155 కోట్లు అవసరమని తేలింది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే మెమోరియల్‌కు మరో రూ.112.50 కోట్లు కావాలని అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో చాలా వరకు విరాళాల రూపంలో సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఒక ట్రస్ట్‌‌ను ఏర్పాటు చెయ్యనుంది. AP Government decided to construct 105 feet NTR Statue on a hill at Capital Amaravathi
అమరావతిలో ఎన్టీఆర్ ప్రాజెక్టు నమూనా


టీడీపీ ఓటమితో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధాని విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకోకపోవచ్చని అమరావతి కోసం భూములిచ్చిన ఇక్కడి రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు స్ధానికులు కూడా భావించారు. అసలే నిధుల కొరత, అప్పుల సమస్యతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వం మరోలా భావించింది. రాష్ట్రంలో ప్రాధాన్య రంగాలను వదిలిపెట్టి రాజధాని కోసం పాకులాడితే మరింత సమస్యల్లో కూరుకుపోవడం ఖాయమని భావించింది. దీంతో రాజధానిలో ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయడంతో పాటు కొత్తగా ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టవద్దని, ఒప్పందాలు చేసుకోవద్దని వైసీపీ సర్కారు భావించింది. తాజాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విడుదల చేసిన శ్వేతపత్రంలోనూ ఇవే అంశాలు ప్రతిబింబించాయి. గత ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.2 లక్షల కోట్లు ఖర్చయ్యే రాజధాని నిర్మాణం చేపట్టడం ఎట్టి పరిస్ధితుల్లోనూ శ్రేయస్కరం కాదనే వాదన శ్వేతపత్రంలో అంతర్లీనంగా కనిపించింది. దీంతో రాజధాని విషయంలో భ్రమలు తొలగిపోయాయన్న వాదన మొదలైంది. అంతిమంగా ఈ నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి రాజకీయంగా మేలు చేస్తుందా లేదా అన్న అంశాన్ని పక్కనబెడితే రాజధానికి భూములిచ్చిన రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం శరాఘాతం కావడం తథ్యంగా కనిపిస్తోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>