హోమ్ /వార్తలు /రాజకీయం /

బాలాకోట్‌లో ఏరిపారేసింది ఉగ్రవాదులనా లేక చెట్లనా? : మోదీపై సిద్దూ సెటైర్

బాలాకోట్‌లో ఏరిపారేసింది ఉగ్రవాదులనా లేక చెట్లనా? : మోదీపై సిద్దూ సెటైర్

నవజోత్ సింగ్ సిద్దు(File)

నవజోత్ సింగ్ సిద్దు(File)

Did you uproot terror or trees? Asks Navjot Sidhu : పాకిస్తాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లాం కూడా భారత్ తమ చెట్లను కూల్చివేసిందని ఆరోపణలు చేశారు. ఇది అంతర్జాతీయ పర్యావరణ నిబంధనలకు విరుద్దమని, దీనిపై ఐరాసకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఇంకా చదవండి ...

  కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాలాకోట్‌పై దాడి విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడ మీరు ఏరిపారేసింది ఉగ్రవాదులనా? లేక చెట్లనా? అని సెటైర్స్ వేశారు. ఇదంతా ఎన్నికల కోసం చేసిన జిమ్మిక్కేనా అని ప్రశ్నించారు. శత్రువుతో పోరాటం ముసుగులో సొంత దేశాన్ని వంచిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా సైన్యం విషయాలను రాజకీయం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బాలాకోట్‌లో ఎంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టారన్న దానిపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సిద్దూ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.


  బాలాకోట్‌పై భారత్ దాడిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ 300 పైచిలుకు ఉగ్రవాదులను ఏరిపారేసినట్టు తొలుత కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కేవలం 35మంది మాత్రమే చనిపోయినట్టు చెప్పినట్టుగా కథనాలు వచ్చాయి. మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు మాత్రం భారత్ ఖాళీ ప్రదేశంలో బాంబులు విసిరిందని చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి.


  పాకిస్తాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లాం కూడా భారత్ తమ చెట్లను కూల్చివేసిందని ఆరోపణలు చేశారు. ఇది అంతర్జాతీయ పర్యావరణ నిబంధనలకు విరుద్దమని, దీనిపై ఐరాసకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. మొత్తం మీద బాలాకోట్‌పై భారత్ దాడిలో అసలేం జరిగిందన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే సిద్దూ మోదీ సర్కార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
   


   


  ఇది కూడా చదవండి : భారత్ 'సర్జికల్ స్ట్రైక్స్-2'పై ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో తెలుసా..!


  భారత్‌పై పాక్ 'పర్యావరణ ఉగ్రవాదం' ఆరోపణలు.. ఐరాసకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక!

  ఆ సంగతి మాకు తెలియదు.. టార్గెట్ ఫినిష్ చేశామా అన్నదే మా లెక్క : ఎయిర్‌ఫోర్స్ చీఫ్


  ఈ దెబ్బతో కర్ణాటకలో 22 సీట్లు ఖాయం..: దుమారం రేపుతున్న యడ్యూరప్ప కామెంట్స్


   

  First published:

  Tags: Abhinandan Varthaman, Imran khan, India VS Pakistan, Narendra modi, Navjot Singh Sidhu, Pakistan, Surgical Strike 2