ఏపీలో మంత్రి కంటే పవర్‌ఫుల్‌గా మారిన ఎమ్మెల్యే?

మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్

మత పరమైన విషయాలు ఏవైనా కూడా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణునే ఎక్కువగా కౌంటర్లు ఇస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నా కూడా ఆయనకంటే ఓ ఎమ్మెల్యే పవర్‌ఫుల్‌గా మారిపోయారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో దుమారం రేపుతున్న అంశానికి సంబంధించి, తన శాఖకు సంబంధించి కూడా ఆ మంత్రి కౌంటర్ ఇవ్వడం లేదు. మంత్రి కంటే ముందే ఓ ఎమ్మెల్యే రంగంలోకి దిగి.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలో మత మార్పిడులు, హిందూ ఆలయాల ఆదాయంపై పన్ను వసూళ్ల వంటి అంశాలు దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పిస్తుంటే.. అధికార పార్టీ ప్రెస్‌మీట్లతో విరుచుకుపడుతోంది. అయితే, ఈ అన్ని అంశాల్లో ప్రధానంగా స్పందించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్దగా నోరు విప్పినట్టు కనిపించడం లేదు. మత పరమైన విషయాలు ఏవైనా కూడా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణునే ఎక్కువగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభుత్వం వాదనను సమర్థంగా వినిపిస్తున్నారు.

    మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత కావడం వల్లే వైసీపీ ఆయన ద్వారా కౌంటర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు మల్లాది విష్ణు సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు. గత ఎన్నికలకు ముందు మల్లాది విష్ణు కోసం వంగవీటి రాధాను కూడా పక్కనపెట్టారు. అయితే, ఇద్దరు నేతలకు మంచి స్నేహం ఉంది. ఇద్దరూ విజయవాడకు చెందిన నేతలే. ఒకరు విజయవాడ సెంట్రల్, మరొకరు విజయవాత పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జగన్‌తో ఉన్న సాన్నిహిత్యందృష్ట్యా మల్లాది విష్ణుకే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే, వెల్లంపల్లిని పదవి వరించింది. అయితే, రెండున్నరేళ్ల తర్వాత కచ్చితంగా మల్లాది విష్ణునే దేవాదాయ శాఖ మంత్రి అవుతారని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: