• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • DID CONGRESS PAY JAISH MONEY RAHUL GANDHI HITS OUT AT BJP OVER MASOOD AZHARS UN LISTING SB

‘జైషే మహ్మద్‌కు కాంగ్రెస్ డబ్చులిచ్చిందా?’ బీజేపీపై రాహుల్ గాంధీ ఎటాక్

‘జైషే మహ్మద్‌కు కాంగ్రెస్ డబ్చులిచ్చిందా?’ బీజేపీపై రాహుల్ గాంధీ ఎటాక్

రాహుల్ గాంధీ (ఫైల్)

2004లో రగులుతున్న కాశ్మీర్‌లో పక్క ప్రణాళికతో పనిచేసి ఉగ్రవాదాన్ని వెనక్కి నెట్టామన్నారు. కానీ ఇప్పుడు మోదీ మరోసారి ఉగ్రవాదులకు తలుపులు తెరుస్తున్నారంటూ మండిపడ్డారు రాహుల్.

 • Share this:
  దేశంలో రాజకీయ వేడి ఊపందుకుంది. అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధంతో ఆ వేడిని మరింత రాజేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ...ప్రధాని నరేంద్ర మోదీపై కొత్త అస్త్రాలను ప్రయోగించారు. శనివారం సీఎన్ఎన్ న్యూస్ 18కు ఇంటర్య్వూ ఇచ్చిన రాహుల్.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేశారు.‘ పుల్వామా ఉగ్రదాడిలో భారత జవాన్లు చనిపోయిన అంనతరం సీఆర్పీఎఫ్ జవాన్ల భద్రతకు మోదీ ఏం చేశారు? జాతీయ భద్రత కోసం ఆయన ఎలా భరోసా ఇస్తున్నారు? పాకిస్థాన్‌కు ఉగ్రవాదుల్ని పంపిందెవరు? కాంగ్రెస్ పార్టీ ఏమైనా జైషే మహ్మద్ సంస్థకు డబ్బులిచ్చిందా? కానే కాదు... ఆ పనిచేసింది బీజేపీ మంత్రి. మేం ఉగ్రవాదుల్ని పట్టుకుంటుంటే.. బీజేపీ వాళ్లను వదిలేస్తుందు అంటూ’ రాహుల్ అధికార పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. గత బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మోదీ..‘మసూద్ అజర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా యునైటడ్ నేషన్స్ ప్రకటించడం ఉగ్రవాదంపై వ్యతిరేకంగా పోరాడుతున్న మనకు నిజంగా ఓ గొప్ప విజయమంటూ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి తమ ప్రభుత్వమే మొదటి అడుగు వేసిందన్నారు. ఇకపై దేశానికి ఎవరినుంచి అయినా ముప్పు ఉందని తెలిస్తే... మేం వాళ్ల ఇంట్లోకి వెళ్లి వాళ్లను ఎలిమినేట్ చేస్తాం...... మన్నారు ప్రధాని. వాళ్లు మాపై బుల్లెట్లు ప్రయోగిస్తే.. మేంవాళ్లపై బాంబులు వేస్తాం’అంటూ మోదీ జైపూర్ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యలు చేశారు.

  మే1న యునైటడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. పుల్వామాలో ఉగ్రదాడి చేసి 40మంది సైనికుల ప్రాణాలు తీసుకున్న జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు దిగింది. మొత్తంమీత దీనిపై ఇటు కాంగ్రెస్ కూడా దీన్ని తమ ఘనతగానే చెప్పుకొనే పనిలో పడింది. కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు రాహుల్ గాంధీ. 2004లో రగులుతున్న కాశ్మీర్‌లో పక్క ప్రణాళికతో పనిచేసి ఉగ్రవాదాన్ని వెనక్కి నెట్టామన్నారు. కానీ ఇప్పుడు మోదీ మరోసారి ఉగ్రవాదులకు తలుపులు తెరుస్తున్నారంటూ మండిపడ్డారు రాహుల్.

  సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... ప్రజలు ఈసారి మోదీకి వ్యతిరేకంగా ఓటేస్తరన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రధాని నెరవేర్చలేదన్నారు. ప్రజలు ఎక్కడ గొంతెత్తుతారో అక్కడ జనం తప్పక గెలుస్తారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ విఫలమయ్యారని రాహుల్ ఆరోపించారు. అదే సమయంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. అదే సమయంలో రైతులు... చిన్నవ్యాపారులకు కూడా మోదీ నిరాశ కల్గించారన్నారు. మోదీకి ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. ఆయన మాట్లాడుతుంటే... ఆ మాటల్లోనే విశ్వాసం తగ్గిపోయిందని తెలుస్తుందన్నారు. మేం మోదీలా రైతులకు 15 లక్షలు ఇస్తామని చెప్పడం లేన్నారు. ఐదేళ్ల కాలంలో రూ.3,60,000 ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. అదే విధంగా 22 లక్షల మంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పిస్తామన్నారు రాహుల్. అనేకరకాల లెక్కలు వేసిన తర్వాతే ఈ హామీలు ఇస్తున్నామన్నారు రాహుల్. మరోసారి రాహుల్ రాఫెల్ డీల్‌పై కూడా విమర్శలు గుప్పించారు. అప్పుల్లో కూరుకుపోయి దివాళ తీసిన అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్ట్ ఇప్పించారని ఆరోపణలు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్‌కు సంబంధించి ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి యుద్ధవిమానాల కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు రాహుల్.

  ప్రజల మధ్య ఎంత తిరుగతున్నా... ఎన్ని ప్రచారాలు నిర్వహించినా తనకు అలుపు రాదన్నారు రాహుల్ గాంధీ. దేశ ప్రజలే తనను ముందుకు నడిపిస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ నేతలు తనపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్నా...వాటిని నేను ఏమాత్రం పట్టించుకోనన్నారు రాహుల్. అలాంటి వ్యాఖ్యలు నాలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపుతాయన్నారు. పార్టీ జనరల్ సెక్టటరీలు ప్రియాంక,జ్యోతిరాదిత్య సింధియాకు తాను మూడు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించానన్నారు రాహుల్. అందులో మొదటిది బీజీపీ-ఆర్ఎస్ఎస్ ఓడించడం, కాంగ్రెస్ పార్టీ భావజాల్ని పరిరక్షించడం, పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టడం.
  First published:

  అగ్ర కథనాలు