ఆ మంత్రిని టార్గెట్ చేసిన సీఎం జగన్? సెట్ చేసేందుకే ఇవన్నీ జరుగుతున్నాయా?

ఏపీ సీఎం వైఎస్ జగన్

మంత్రి స‌న్నిహితుల‌కు ప్ర‌భుత్వంలో ప‌నులు అప్ప‌గించ‌డంతోపాటు దుర్గ గుడిలో సెక్యూరీటి ద‌గ్గ‌ర నుంచి అన్నింటిలో మంత్రి అనుచ‌ర‌ల‌దే హవా నుడుస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ కాస్త ముఖ్య‌మంత్రి జగన్ వ‌ర‌కు వెళ్ల‌డంతో ఆయన దృష్టి సారించారు.

 • Share this:
  (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18)

  ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహాన్ రెడ్డి త‌న మంత్రివ‌ర్గంలో ఉన్న మంత్రుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఒక క‌న్నేసి ఉంచుతారు. అందుకు కోసం త‌న ప్ర‌త్యేక టీమ్ లు ఎప్పుడూ ప‌ని చేస్తాయి. అయితే తాజాగా ఏపీలో ఓ మంత్రి ముఖ్య‌మంత్రి క‌న్నుల్లో ప‌డిన‌ట్లు పార్టీ వ‌ర్గాల‌తోపాటు ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా చెవులు కొరుక్కుంటున్నాయి. ఆయ‌నే ఏపీ దేవాదాయ‌శాఖా మంత్రి వెల్లంప‌ల్లి. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్న మంత్రి స‌రైన విధంగా హ్యండిల్ చేయ‌లేద‌నే భావ‌న ముఖ్యమంత్రిలో ఉంది. దీంతో పాటు ఇష్యూ హ్యండిల్ చేయ‌క‌పోతే చేయ‌లేక‌పోయారు కాని ఆ సంధ‌ర్భంలో మంత్రి మీడియా ముందు మాట్లాడిన మాట‌లు ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇర‌కాటంలో పెట్టాయి. దీంతో ఈ అంశంలో మంత్రిపై ముఖ్య‌మంత్రి కాస్త ఆగ్ర‌హాంగా ఉన్న‌ట్లు తెస్తోంది.

  దీంతోపాటు మంత్రి స‌న్నిహితుల‌కు ప్ర‌భుత్వంలో ప‌నులు అప్ప‌గించ‌డంతోపాటు దుర్గ గుడిలో సెక్యూరీటి ద‌గ్గ‌ర నుంచి అన్నింటిలో మంత్రి అనుచ‌ర‌ల‌దే హవా నుడుస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ కాస్త ముఖ్య‌మంత్రి జగన్ వ‌ర‌కు వెళ్ల‌డంతో ఇప్ప‌టికే ఒక అంశంలో మంత్రి ప‌ని తీరుపై సీరియ‌స్ గా ఉన్న సీఎం ఈ విష‌యంతో మ‌రింత ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కార‌ణం వ‌ల‌నే తాజాగా దుర్గ‌గుడిలో జ‌రిగిన అక్ర‌మాల‌పై ఏసీబీ దాడులు చేయ‌డం వెనుక ముఖ్య‌మంత్రి ఆదేశాలు ఉన్న‌యానే విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అయితే ఎప్పుడు ముఖ్య‌మంత్రికి స‌న్నిహితంగా ఉన్న‌ానని చెప్పుకునే మంత్రిపైనే ఇలా ముఖ్య‌మంత్రే టార్గెట్ చేయ‌డం ఇప్పుడు పార్టీ వ‌ర్గాల‌తోపాటు ప్ర‌భుత్వ వ‌ర్గాలను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ అంశంతో మిగిలిన మంత్రులు కూడా అల‌ర్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఎంత స‌న్నిహితులైన ఏ ప‌ని కోసం వ‌చ్చినా ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి ఆ ప‌నులు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

  ఏ ప‌ని ఎప్పుకుంటే అది ఎలా ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు చేరుతుందో అనే ఆందోళ‌న‌లో మంత్రులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మ‌రి కొద్ది రోజుల్లో ఏపీలో క్యాబినేట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో అప్పుడు ఎవ‌రు ఉంటారో ఎవ‌రు ఊడ‌తారో అనే అంశంపై నేత‌లు ఇప్ప‌టి నుంచే టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌విలు ద‌క్కని వారికి మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఒక వైపు కంప్లైట్స్ వ‌చ్చిన మంత్రులు ఆందోళ‌న ప‌డుతుంటే మ‌రో వైపు ఎంత మంది పై కంప్లైట్స్ వ‌స్తే త‌మ లైన్ అంత క్లియ‌ర్ అవుతుంద‌నే భావ‌న‌లో చాలా మంది నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మొత్తానికి వెల్లంప‌ల్లి అంశం ఇప్పుడు ప్ర‌భుత్వంలో అటు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: