అమరావతిపై ప్రధాని మోదీకి జగన్ సీక్రెట్ లెటర్?

Amaravati | అమరావతి వివాదంపై స్పందించిన వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు, సలహాలతోనే తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు.

news18-telugu
Updated: August 22, 2019, 7:31 PM IST
అమరావతిపై ప్రధాని మోదీకి జగన్ సీక్రెట్ లెటర్?
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్
  • Share this:
అమరావతిపై ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ జరుగుతోంది. ఏపీ రాజధానిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి మీద పెద్దగా ఆసక్తి లేదనే ప్రచారం జోరందుకుంది. అయితే, ప్రతిపక్షాలు దీన్ని తప్పు పడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఓ అడుగు ముందుకేసి.. రాజధానిని అమరావతి నుంచి మారిస్తే ఆమరణ దీక్షకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరణ ఇచ్చారు. అమరావతిని ఎక్కడికీ మార్చబోమన్నారు. అయితే, మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమరావతి గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని మోదీ సర్కారుకు రాసిన లేఖను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంటే, జగన్ మోహన్ రెడ్డి మోదీకి ఓ సీక్రెట్ లేఖను పంపారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అమరావతి వివాదంపై స్పందించిన వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు, సలహాలతోనే తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు. పోలవరం, పీపీఏల గురించి ఆయన ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి చెప్పిన మాటలను బట్టి అమరావతి గురించి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందే చెప్పిందా అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో కలుగుతోంది.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>