చంద్రబాబుకు తగిన గౌరవం దక్కలేదా?... అసెంబ్లీలో ఏం జరిగింది?

chandrababu Naidu | ప్రతిపక్షనేత వాహనాలను మంత్రుల వాహనాలతో సమానంగా పార్క్‌చేసుకునే అవకాశం ఉండేది. అయితే చంద్రబాబుకు అలాంటి గౌరవం ఏమీ లభించకపోవడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

news18-telugu
Updated: June 12, 2019, 8:09 PM IST
చంద్రబాబుకు తగిన గౌరవం దక్కలేదా?... అసెంబ్లీలో ఏం జరిగింది?
అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేస్తున్న చంద్రబాబునాయుడు
news18-telugu
Updated: June 12, 2019, 8:09 PM IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం కల్పించలేదని తెలుగుదేశం నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. చంద్రబాబు కాన్వాయ్​లో మార్పులు చేయాలంటే... ఎస్ఆర్టీలో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఎస్కార్ట్​ వాహనాన్ని తప్పించారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన కాన్వాయ్‌లో పైలెట్‌, ఎస్కార్ట్‌-1, ఎస్కార్ట్‌-2, జామర్‌, వీఐపీ స్పేర్‌, ఎన్‌ఎస్‌జీ-1, ఎన్‌ఎస్‌జీ-2 ఇలా మొత్తం 8 వాహనాలతో కాన్వాయ్‌ ఉండాలి. చంద్రబాబు కాన్వాయ్​లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉన్నా సెక్యూరిటీ ఎస్‌ఆర్టీలో భద్రతా సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రబాబుకు పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనంతోపాటు ఎస్కార్ట్‌ అధికారి వాహనాన్ని తప్పించారు.  సమీక్ష లేకుండా కొందరు అధికారుల అత్యుత్సాహంతోనే ఇది జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ప్రయాణించిన వాహనం మినహా మిగిలిన వాహనాలన్నింటినీ అసెంబ్లీ బయట పెట్టించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షనేత జగన్‌ కాన్వాయ్‌కు అసెంబ్లీలో ఏ-2 నుంచి లోనికి అనుమతి ఉండేది. ప్రతిపక్షనేత వాహనాలను మంత్రుల వాహనాలతో సమానంగా పార్క్‌చేసుకునే అవకాశం ఉండేది. అయితే చంద్రబాబుకు అలాంటి గౌరవం ఏమీ లభించకపోవడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా తగిన గౌరవం చంద్రబాబుకు ఉండేది. మునుపెన్నడూ ఇలా లేదనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...