చిరంజీవిని పక్కనపెట్టి ‘చిరు హీరో’కు జగన్ అపాయింట్‌మెంట్...

Chirajneevi | చిరంజీవి ఎప్పటి నుంచో జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తుంటే.. ఆయన కంటే ముందు ఓ చిన్నహీరోకు సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

news18-telugu
Updated: October 13, 2019, 3:14 PM IST
చిరంజీవిని పక్కనపెట్టి ‘చిరు హీరో’కు జగన్ అపాయింట్‌మెంట్...
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ
news18-telugu
Updated: October 13, 2019, 3:14 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి కంటే ఓ చిన్న హీరోకు అధిక ప్రాధాన్యం ఇచ్చారా? తాజాగా జరిగిన ఘటనలు దానికి ఔననే సమాధానం వస్తుంది. సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను చిరంజీవి కలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌ను కూడా కలిశారు. సైరా సినిమాను చూసిన ఆమె మెగాస్టార్‌ను అభినందించారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా కలవడానికి చిరంజీవి అపాయింట్‌మెంట్ అడిగారు. ఈనెల 11న జగన్‌తో చిరంజీవి భేటీకి అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ ఫేక్ న్యూస్ అని తేలిసింది. తాజాగా ఈనెల 14న అమరావతిలో సీఎం జగన్‌తో మెగాస్టార్ భేటీ కాబోతున్నట్టు చెబుతున్నారు. అయితే, చిరంజీవి ఎప్పటి నుంచో అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తుంటే.. ఆయన కంటే ముందు ఓ చిన్నహీరోకు జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం. ఏకంగా సినిమా యూనిట్ మొత్తానికి ఆశీస్సులు అందించడం విశేషం.

ఆటో రజిని సినిమా బృందంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి


‘ఆటో రజిని’ పేరుతో వస్తున్న సినిమాకు జగన్ క్లాప్ కొట్టారు. జెఎస్ఆర్‌ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి.లింగుస్వామి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. జొన్నలగడ్డ హరికృష్ణ హీరో. ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాలో నటించిన ఈ హరికృష్ణ తన రెండో సినిమాకు జగన్ ఆశీస్సులు పొందారు. తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన సినిమా యూనిట్.. జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. వారి ‘ఆటో రజినీ’కి జగన్ ఆశీస్సులు అందజేశారు.

ఆర్టీసీ కార్మికుడి కడుపులో సీఐ పిడిగుద్దులు



First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...