సీఎం పని చేతకాకపోతే చెప్రాసీ పని చేయండి.. కేసీఆర్‌‌పై బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

‘చీఫ్ మినిస్టర్ పని చేతకాక పోతే కనీసం చెప్రాపీ పనైనా స‌రిగా చేయండి’ అని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి ఆర్వింద్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

  • Share this:
    ‘చీఫ్ మినిస్టర్ పని చేతకాక పోతే కనీసం చెప్రాపీ పనైనా స‌రిగా చేయండి’ అని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి ఆర్వింద్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లోనే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న‌ామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. కానీ దేశం మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని అయ‌న చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ట్రాన్స్ పోర్టు ఖర్చులు మాత్ర‌మే భ‌రిస్తుంద‌ని అయ‌న తెలిపారు. కరోనా కారణంగా గన్నీ బ్యాగులు లేక‌, హమాలీలు లేక, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం ఆలస్యం అవుతుంద‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చెబుతుంది. గత సంవత్సరం కూడా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడిందని, అది దృష్టిలో ఉంచుకొని ఈసారి పంటాలు కూడా విస్తారంగా పండాయి.. గ‌న్ని బ్యాగుల‌ను పెంచాల్సిన ఆవ‌సరం ప్ర‌భుత్వంపై ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరీష్ రావు జిల్లాలో కేటీఆర్ కు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. నిన్న ముగ్గురు మంత్రులు ప్రగతిభవన్ నుంచి వచ్చిన పాంప్లె‌ట్ ను మాత్రమే చదివారని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద ఆన‌వ‌సరంగా త‌రుగు పేరుతో రైతుల‌ను మోసం చేస్తున్నార‌ని అయ‌న మండిప‌డ్డారు. ఎలాంటి త‌రుగు లేకుండా రైతుల పంట‌ల‌ను కొనుగోలు చేయాలని అయ‌న డిమాండ్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: