ఆ విషయం మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం జగన్‌కు లేదు : దేవినేని

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని.. నిజానికి వారి ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కావడం లేదని ఆరోపించారు.

news18-telugu
Updated: October 20, 2019, 5:43 PM IST
ఆ విషయం మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం జగన్‌కు లేదు : దేవినేని
వైఎస్ జగన్,దేవినేని ఉమా (File Photos)
news18-telugu
Updated: October 20, 2019, 5:43 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేయడమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో.. మీడియా ముందుకు వచ్చి చెప్పేంత ధైర్యం జగన్‌కు లేదని విమర్శించారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ పేరుతో రియాలిటీ షో నడిపిస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.73వేల 622కోట్ల పనులు నడిచాయని..గడిచిన నాలుగు నెలల పాలనలో జబ్బలు చరుచుకోవడమే సరిపోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులన్నీ హైకోర్టు చుట్టూనే తిరుగుతున్నాయని.. ఇప్పటివరకు ఒక బొచ్చెడు సిమెంటు కూడా వేయలేదని మండిపడ్డారు.

కచ్చలూరు వద్ద బోటు మునిగి నెల రోజులు దాటిపోతున్నా.. సీఎం దాన్ని పట్టించుకోవడం లేదన్నారు.వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని.. నిజానికి వారి ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాత్రి 8గంటల తర్వాత మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలే మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఇవన్నీ మాట్లాడవద్దనే మీడియా స్వేచ్చను హరించేందుకు జీవో నం.938 తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్రంలో 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక లారీలు యథేచ్చగా హైదరాబాద్,బెంగళూరుకు తిరుగుతున్నాయని ఆరోపించారు.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...