సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాష్

ఇవాళ ఉదయం తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అవినాష్. రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.

news18-telugu
Updated: November 14, 2019, 4:57 PM IST
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
వైసీపీలో చేరిన అవినాష్
  • Share this:
ఏపీలో రాజకీయ నేతల వలసలు జోరందుకున్నాయి. ఇటు బీజేపీ, అటు వైసీపీ..ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా టీడీపీకి యువనేత దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. తెలుగు యువత అధ్యక్ష పదవి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్.. సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. అవినాష్‌కు విజయవాడ తూర్పు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరాను. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ సీఎం అయ్యేందుకు సైనికుడిలా పని చేస్తాను. మా వర్గం కార్యకర్తలు, నాయకులకు టీడీపీలో అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మా అభిమానులు కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారా.
దేవినేని అవినాష్


ఇవాళ ఉదయం తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అవినాష్. రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాష్‌తోపాటు పాటు కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో సరైన ప్రాతినిథ్యం దక్కలేదని కొంతకాలంగా అవినాష్ అసంతృప్తితో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు అవినాష్.First published: November 14, 2019, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading