శివసేనకు థాంక్స్... ఉద్ధవ్ థాక్రే అబద్ధాలు.. దేవంద్ర ఫడ్నవీస్

ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న బీజేపీతో చర్చలు జరపడం మానేసి.. శివసేన నేతలు ఎన్సీపీతో చర్చలు జరిపారని ఫడ్నవీస్ మండిపడ్డారు.

news18-telugu
Updated: November 8, 2019, 5:08 PM IST
శివసేనకు థాంక్స్... ఉద్ధవ్ థాక్రే అబద్ధాలు.. దేవంద్ర ఫడ్నవీస్
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్
  • Share this:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. తమకు రెండున్నరేళ్ల ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మద్దతిస్తామని శివసేన తేల్చిచెప్పడంతో ఆయన పీఠం దిగక తప్పలేదు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి తన రాజీనామాను సమర్పించారు. రాజీనామా అనంతరం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. తన ఐదేళ్ల పాలనా కాలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు. ముంబై కోసం, రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలను వివరించారు. ఐదేళ్ల పాలనాకాలంలో తనకు సహకరించిన శివసేనకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన బీజేపీ పెద్దలకు థాంక్స్ చెప్పారు. అయితే, తాజాగా రెండున్నరేళ్ల సీఎం పదవి డిమాండ్‌పై మాత్రం ఆయన శివసేన వైఖరిని తప్పుపట్టారు.

‘బీజేపీకి అనుకున్నదానికంటే తక్కువ సీట్లే వచ్చాయి. కానీ, మా పొత్తుకు ప్రజలు క్లియర్ మెజారిటీ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని డిమాండ్ చేయడం ద్వారా ఉద్ధవ్ థాక్రే ప్రజల్ని షాక్‌కి గురి చేశారు. సీఎం పదవిని సగం సగం పంచుకుందామనే ప్రతిపాదన నా ఎదుట అయితే రాలేదు. అమిత్ షాతో చర్చించిన తర్వాత నితిన్ గడ్కరీ కూడా నాకు ఈ విషయాన్ని చెప్పారు.’ అని ఫడ్నవీస్ అన్నారు.

ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న బీజేపీతో చర్చలు జరపడం మానేసి.. శివసేన నేతలు ఎన్సీపీతో చర్చలు జరిపారని ఫడ్నవీస్ మండిపడ్డారు. ఉద్ధవ్ థాక్రే తనకు ఫోన్ కాల్స్‌కు స్పందించలేదని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా బీజేపీ - శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 8, 2019, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading