టీడీపీకి మరో షాక్... పార్టీకి యువనేత గుడ్ బై

సీనియర్ రాజకీయ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేశారు.

news18-telugu
Updated: September 30, 2019, 4:43 PM IST
టీడీపీకి మరో షాక్... పార్టీకి యువనేత గుడ్ బై
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు... మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పోటీకి దిగింది. దీంతో టీటీడీపీలో కొత్త ఉత్సాహం వస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ టీడీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. వివిధ రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ రాజీ పడిందని... పార్టీకి సిద్ధాంతాలు లేకపోవడం అంటే ఆత్మ లేకపోవడమే అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Veerandar goud, veerandar goud quits tdp, veerandar goud joins bjp, devandar goud son veerandar goud, tdp, telangana, ttdp, congress, trs, bjp, cm kcr, telangana latest news, వీరేందర్ గౌడ్, టీడీపీకి వీరేందర్ గౌడ్ రాజీనామా, దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, టీడీపీ, తెలంగాణ, టీటీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్
దేవేందర్ గౌడ్‌తో ఆయన తనయుడు వీరేందర్ గౌడ్(ఫైల్ ఫోటో)


ఈ కారణంగా తాను పార్టీలో కొనసాగలేనని వివరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీడీపీకి గుడ్ బై చెప్పిన వీరేందర్ గౌడ్ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తెలంగాణలోని బలమైన నేతలు, టీఆర్ఎస్‌ను ఢీ కొట్టగలిగే నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ... వీరేందర్ గౌడ్‌తోనే సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని బీజేపీ నేతలు హామీ ఇవ్వడంతో... ఆయన బీజేపీలో చేరేందుకు అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
First published: September 30, 2019, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading