Lok Sabha Elections 2019 : నాలుగో విడత ఎన్నికల్లో 64శాతం పోలింగ్ నమోదు
Lok Sabha Elections 2019 : 9 రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 961 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. 12.79కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
నాలుగో విడత ఎన్నికల్లో 64శాతం పోలింగ్ నమోదయింది. 2014 పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయిందని ఎన్నికల అధికారులు తెలిపారు.
13:42 (IST)
ఓటు హక్కు వినియోగించుకున్న ఫరా ఖాన్..
13:39 (IST)
ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ నటి కరీనా కపూర్..
13:34 (IST)
నాలుగో విడత ఎన్నికల బరిలోని అభ్యర్థుల విశేషాలు...
13:24 (IST)
ముంబైలోని మలబార్ హిల్‌లో ఉన్న వాల్సింఘం స్కూల్ పోలింగ్ బూత్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
13:23 (IST)
ఓటేసిన హేమ మాలిని
బీజేపీ మథుర లోక్‌సభ అభ్యర్థి హేమ మాలిని తన కుమార్తెలు ఇషా డియోల్, అచనా డియోల్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
13:20 (IST)
కుటుంబ సభ్యులు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్‌లతో కలిసి ఓటు వేసేందుక వచ్చిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్..
13:15 (IST)
కశ్మీర్లో రాళ్ల దాడి...
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్న అనంత్‌నాగ్ లోక్‌సభ పరిధిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కుల్గాం, షోఫియన్ జిల్లాల్లో రాళ్ల దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి.
13:8 (IST)
ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా
13:6 (IST)
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే..
నాలుగో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నాలుగో విడతలో 64 పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 9 రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర (17), ఉత్తరప్రదేశ్ (13), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (8), మధ్యప్రదేశ్ (6), ఒడిశా (6), బీహార్ (5), ఝార్ఖండ్ (3), జమ్మూకాశ్మీర్ (1) రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.