మహా ట్విస్ట్... డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు.

news18-telugu
Updated: November 26, 2019, 2:50 PM IST
మహా ట్విస్ట్... డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా
ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్
  • Share this:
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ట్విస్ట్‌ల మీద ట్విస్టులతో సాగుతోంది. శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కొన్ని గంటల ముందే ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్‌తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఈనెల 23వ తేదీ శనివారం రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రోజు తెల్లవారుఝామున 5.43 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఆ వెంటనే ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

దీనిపై ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన కలసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీకి మెజారిటీ లేదని సుప్రీంకోర్టు‌లో పిటిషన్ వేశాయి. దీని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈనెల 27వ తేదీ సాయంత్రం లోపు ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం మొత్త లైవ్ టెలికాస్ట్ చేయాలని, ఎలాంటి రహస్య ఓటింగ్ నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే అజిత్ పవార్ రాజీనామా చేయడం విశేషం. ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం కూడగట్టడంలో విఫలం అయినందువల్లే అజిత్ పవార్ రాజీనామా చేసినట్టు తెలిసింది.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>