HOME »NEWS »POLITICS »denied ticket maharashtra congress mla takes away 300 chairs from party office ba

నాకు టికెట్ ఇవ్వకపోతే నా కుర్చీలు ఎందుకు?.. తీసుకెళ్లిపోయిన నేత..

నాకు టికెట్ ఇవ్వకపోతే నా కుర్చీలు ఎందుకు?.. తీసుకెళ్లిపోయిన నేత..
ప్రతీకాత్మక చిత్రం

‘ఔను. ఆ కుర్చీలు నేనే వేయించా. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను వేయించిన కుర్చీలు ఎందుకు? అందుకు తీసుకుని వెళ్లిపోయా.’ అని కుండబద్దలు కొట్టారు.

  • Share this:
    మహారాష్ట్రలో ఓ కాంగ్రెస్ నేత తనకు టికెట్ దక్కనందుకు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. మధ్య మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నాయకుడు పార్టీ మీటింగ్‌ కోసం వేసిన కుర్చీలను తీసుకుని వెళ్లిపోయారు. ఔరంగాబాద్ జిల్లాలోని సిలోద్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్.. లోక్‌సభ టికెట్ ఆశించారు. అయితే, ఆయనకు కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సుభాష్ ఝామ్‌బాద్‌కు కేటాయించింది. దీంతో సత్తార్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పార్టీ కార్యాలయంలో మీటింగ్‌ల కోసం తాను అందించిన 300 కుర్చీలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆయన, అనుచరులు కలిసి కుర్చీలను తీసుకుని వెళ్లిపోయారు.

    కాంగ్రెస్, ఎన్సీపీ కలసి స్థానిక హస్తం పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే, అక్కడ కుర్చీలు లేకపోవడంతో సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చారు. దీనిపై సత్తార్‌ను పీటీఐ వార్తాసంస్థ ప్రశ్నించగా ‘ఔను. ఆ కుర్చీలు నేనే వేయించా. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను వేయించిన కుర్చీలు ఎందుకు? అందుకు తీసుకుని వెళ్లిపోయా. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నా. ఎవరికి టికెట్ ఇచ్చారో వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటారు’ అని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన అభ్యర్థి సుభాష్ ‘ఆయనకు కుర్చీల అవసరం ఉండి ఉండొచ్చు. దీని మీద పెద్దగా అసంతృప్తి చెందాల్సిన పనిలేదు. సత్తార్ రాజీనామా కూడా ఇంకా ఆమోదం పొందలేదు.’ అని చెప్పారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:March 27, 2019, 15:29 IST

    टॉप स्टोरीज