టీఆర్ఎస్‌లో తీవ్రమవుతున్న అసంతృప్తి సెగలు.. అసహనంతో ఒక్కొక్కరుగా..

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయా? మంత్రి పదవులు దక్కక నేతలు పార్టీ అధిష్ఠానంపై అసమ్మతి గళం వినిపిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లు చప్పుడు చేయకుండా ఉన్న నేతలంతా పదవులు దక్కకపోవడంతో దాచుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 10, 2019, 5:13 PM IST
టీఆర్ఎస్‌లో తీవ్రమవుతున్న అసంతృప్తి సెగలు.. అసహనంతో ఒక్కొక్కరుగా..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయా? మంత్రి పదవులు దక్కక నేతలు పార్టీ అధిష్ఠానంపై అసమ్మతి గళం వినిపిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లు చప్పుడు చేయకుండా ఉన్న నేతలంతా పదవులు దక్కకపోవడంతో దాచుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని అభిప్రాయపడుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల తర్వాత పార్టీలో అసమ్మతి స్వరం గళమెత్తిందని చెబుతున్నారు. ఓ సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు అద్దం పడుతున్నాయని వెల్లడిస్తున్నారు. అంతకుముందు హరీష్ రావుకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం కూడా సీఎం కేసీఆర్ తీరుపై అసహనంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఒకానొక దశలో హరీష్ రావు బీజేపీలోకి లేదా కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలున్నట్లు కూడా ఊహాగానాలు గుప్పుమన్నాయి.

అయితే, తాజాగా హరీష్ రావుకు మంత్రి పదవి దక్కడంతో ఆ ఊహాగానాలు పటాపంచలు అయ్యాయని టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావుకు మంత్రి పదవి దక్కడం గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగిందని కూడా వెల్లడించాయి. అయితే, రాష్ట్ర మంత్రి వర్గంలో తమకు చోటు దక్కుతుందని చాలా మంది సీనియర్లు ఆశతో ఎదురు చూశారు. కానీ.. నిరాశే ఎదురుకావడంతో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏకంగా కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా, మాజీ మంత్రి జోగు రామన్న తన గన్‌మెన్లను వెనక్కిపంపడం కూడా అందులో భాగమేనని స్పష్టం చేస్తున్నారు.

ఆయనతో పాటు అరికెపూడి గాంధీ కూడా తన గన్‌మెన్లను వెనక్కి పంపారు. విప్ పదవిని ఆశించిన ఆయన అది రాకపోవడంతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. పదవులు రాకే అలక వహించి ఇలా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అయితే, ఇవన్నీ పుకార్లేనని పలువురు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మాజీ మంత్రి రాజయ్య, జూపల్ల కృష్ణారావు.. తదితర నేతలు పార్టీలో అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 10, 2019, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading