Delhi Violence: కనిపిస్తే కాల్చేయడమే... 20కు చేరిన మృతుల సంఖ్య

Delhi Violence: మౌజ్ పూర్, సీలమ్ పూర్, గోకుల్ పురిలో సీఏఏకు అనుకూల వ్యతిరేక వర్గాలు పరస్పర దాడులకు దిగాయి. ఈ హింసాకాండలో ఇప్పటివరకు మృతుల సంఖ్య20కి చేరింది.

news18-telugu
Updated: February 26, 2020, 12:08 PM IST
Delhi Violence: కనిపిస్తే కాల్చేయడమే... 20కు చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భారీ భద్రత
  • Share this:
దేశ రాజధాని ఢిల్లీ నివురు గప్పిన నిప్పులా మారింది. గత మూడు రోజులుగా సీఏఏకు అనుకూల, వ్యతిరక వర్గాల నిరసనలు, దాడులతో అట్టుడుకుతోంది. రాళ్లు, కర్రలు, పెట్రో బాంబులతో దాడులు చేస్తూ నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లలో అల్లర్లు తీవ్రత ఉద్రిక్తంగా మారింది. మౌజ్ పూర్, సీలమ్ పూర్, గోకుల్ పురిలో సీఏఏకు అనుకూల వ్యతిరేక వర్గాలు పరస్పర దాడులకు దిగాయి. ఈ హింసాకాండలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 20కి  చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరో నలుగురు మృతిచెందారు. ఇప్పటివరకు 150మందికి పైగా మంతి గాయాల పాలయ్యారు. గాయపడ్డవారిలో 56 మంది పోలీసులు, ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో అధికారులు కర్ఫ్యూ విధించారు. షూట్ అండ్ సైట్స్ ఆర్డర్స్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ అల్లర్లతో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించిందని అధికారులు చెబుతున్నారు.

జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్... అర్థరాత్రి అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో పర్యటించారు. రాత్రి 3 గంటలవరకు ఆయన అక్కడే ఉన్నారు. భద్రతకు సంబంధించిన అంశాలపట్ల అధికారులతో ఆయన చర్చించారు. ఇరు వర్గాలకు చెందిన వారితో ఆయన మాట్లాడారు. పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు వర్గాలకు చెందిన నాయకులు తొందరగా సమస్యను పరిష్కరించాలని అజిత్ ధోవల్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ అల్లర్లపై మరికాసేపట్లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశంకానుంది.

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం.... ఈశాన్య ప్రాంతంలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఢిల్లీ సర్కార్ విజ్ఞప్తి మేరకు పలు పరీక్షల్ని కూడా రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. ముఖ్యంగా... పది పన్నెండు తరగతులకు సంబంధించిన పరీక్షల్ని వాయిదా వేశారు.


First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు