మాజీ స్పీకర్ కోడెలకు షాక్... కొడుకు అరెస్ట్‌కు రంగం సిద్ధం

కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)

గుంటూరు జిల్లాలో కేబుల్ బిజినెస్‌లో కూడా శివ రామకృష్ణ.. పలువురు వ్యాపారులను మోసం చేసి మరీ రూ.70 కోట్లకు పైగా వెనుకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి.

  • Share this:
    ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ సీనియర్ నేత... మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో షాక్ తగిలింది. కోడెల కుమారుడు శివరామకృష్ణ అరెస్ట్‌ కానున్నట్లు తెలుస్తోంది. 2014లో కోడెల గెలుపుతో కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు ప్రజలు పట్టి పీడించాడని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జీఎస్టీ బదులు కేఎస్టీ కూడా వసూలు చేస్తున్నారని శివరామకృష్ణపై ఆరోపణలున్నాయి. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో కూడా జనం జగన్ వద్ద ఇదే విషయాన్ని మొరపెట్టుకున్నారు. అంతే కాకుండా గుంటూరు జిల్లాలో కేబుల్ బిజినెస్‌లో కూడా శివ రామకృష్ణ.. పలువురు వ్యాపారులను మోసం చేసి మరీ రూ.70 కోట్లకు పైగా వెనుకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి.

    ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయన పై ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రి నుండి కోడెల శివరాంకి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, గుంటూరులోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లి పోలిసులు సహా ఈడీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా కేబుల్‌ పైరసీ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం.. నిర్వహిస్తున్న సోదాలేనని, ఇందులో ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని అంటున్నారు అధికారులు. శివరాం..పైరసీ ద్వారా కేబుల్‌ కనెక్షన్‌ వ్యాపారం చేసి సుమారు రూ.70 కోట్లు కేబుల్‌ కంపెనీలకు ఎగ్గొట్టినట్లు కోర్టుకి కంపెనీలు ఆధారాలు సమర్పించాయి.

    ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు.. భారత దేశ చరిత్ర లో ఇంత భారీ స్థాయి లో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్‌ పైరసీ కేసు ఇదేనంటూ పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు అణువణువును గాలిస్తున్నాయి. దీంతో ఈ కేసులో కోడెల శివరాం ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    First published: