DELHI HIGH COURT UPHOLDS EVICTION OF ASSOCIATED JOURNALS LIMITED FROM HERALD HOUSE
రాహుల్, సోనియాకు ఎదురుదెబ్బ...నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో )
National Herald Case | హెరాల్డ్ హౌస్ నుంచి ఖాళీ చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలంటూ నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. న్యూఢిల్లీలో హెరాల్డ్ హౌస్‌లోని నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్) కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏజేఎల్ కార్యాలయాన్ని హెరాల్డ్ హౌస్ నుంచి ఖాళీ చేయాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలంటూ ఏజేఎల్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్ర మేనన్, జస్టిస్ వీకే రావుతో కూడిన ద్విసభ్య బెంచ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ...హెరాల్డ్ హౌస్ నుంచి ఖాళీ చేయాలని ఏజేఎల్ని ఆదేశించింది.
అయితే ఎప్పటిలోగా హెరాల్డ్ హౌస్ నుంచి ఖాళీ చేయాలో ఎలాంటి గడువు కోర్టు విధించలేదు. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలకు ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.
ఏజేఎల్‌కు ఇచ్చిన 56 ఏళ్ల లీజు ముగియడంతో దాన్ని ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. సదరు భవనం నుంచి ప్రింటింగ్ లేదా ప్రచురణ కార్యక్రమాలు జరగడం లేదని, అందులో నుంచి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేంద్రం ఆరోపిస్తోంది. లీజును రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఏజేఎల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.