హోమ్ /వార్తలు /రాజకీయం /

మన్మోహన్ సింగ్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టులో తొలిగిన అడ్డంకులు

మన్మోహన్ సింగ్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టులో తొలిగిన అడ్డంకులు

మన్మోహన్ సింగ్ జీవితకథ ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

మన్మోహన్ సింగ్ జీవితకథ ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

భారత మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన ఈ ప్రచార చిత్రంలో చూపించినవన్ని నిజాలు కావంటూ... పూజా మహాజన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ఈ ట్రైలర్‌ను నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇంకా చదవండి ...

  భారత మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు.


  ఈ చిత్రాన్ని ప్రముఖ పాత్రికేయుడు అప్పటి ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ అనే పుస్తకం ఆధారంగా విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసాడు. రీసెంట్‌గా విడుదలైన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు..దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మగా చేసి సోనియా, రాహుల్ గాంధీలు ఎలా ఈ దేశాన్ని పరిపాలించారనేది ఈ మూవీ ట్రైలర్‌లో చూపించారు.


  తాజాగా విడుదలైన ఈ ప్రచార చిత్రంలో చూపించినవన్ని నిజాలు కావంటూ... పూజా మహాజన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ఈ ట్రైలర్‌ను నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు ఒక వ్యక్తికి సంబంధించిన జీవితాన్ని సినిమాగా తీసేటపుడు సెక్షన్ 416 ప్రకారం వాళ్ల అనుమతి తీసుకోవాలి. కానీ ఈ సినిమా విషయమై మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ నుంచి కానీ..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కాబట్టి ఈ ట్రైలర్‌ను నిషేదించాలని తన పిటిషన్‌లో పేర్కొంది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి..సదరు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం  చేశారు. అసలు పిటిషన్ వేయడానికి ఆమెకు సినిమాతో ఉన్న సంబంధమేమిటని ప్రశ్నించింది. అంతేకాదు ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు ఊరట నిచ్చేలా ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. ఈ బయోపిక్‌లో సంజయ్ బారు క్యారెక్టర్‌లో అక్షయ్ ఖన్నా నటించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.


  కైరా అద్వానీ హాట్ ఫోటోస్..  ఇవి కూడా చదవండి 


  నిమ్మకూరులో సందడి చేసిన ఎన్టీఆర్, బసవతారకం


  #NTRBiopic: ‘క‌థానాయ‌కుడు’ న్యూ ప్రోమో.. ఏఎన్నార్ ఎలా ఉన్నాడంటే..

  First published:

  Tags: Anupam Kher, Bollywood, Hindi Cinema, Manmohan singh

  ఉత్తమ కథలు