HOME »NEWS »POLITICS »delhi election results 2020 relook on exit polls predictions on delhi assembly elections ba

Delhi Election Results 2020: ఢిల్లీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే..

Delhi Election Results 2020: ఢిల్లీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే..
కరోనా సంక్షోభం సమయంలో అన్నీ రద్దువుతున్న సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు, ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది.

Delhi Election Results 2020 | ఢిల్లీలో అధికార పీఠం ఎవరిదో మరికొన్ని గంటల వ్యవధిలో తేలిపోనుంది. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనావేస్తుండగా...అనూహ్య విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

  • Share this:
    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. పటిష్టబందోబస్తు ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గం.ల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఢిల్లీలో అధికార పీఠాన్ని మళ్లీ అర్వింద్ కేజ్రీవాల్ కైవసం చేసుకోబుతున్నారని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనావేశాయి. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టాయి. అయితే బీజేపీ మాత్రం తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేస్తోంది. రాసిపెట్టుకోండి ఢిల్లీలో గెలిచేది మేమే...ఆ తర్వాత ఈవీఎంలను నిందించకండి అంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అధికార పీఠం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రారంభంకానుండగా..అధికార పీఠం ఎవరితో  11 గం.లకల్లా ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

    ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పలు జాతీయ వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేశాయి. అందులో మెజారిటీ సర్వేలు ఆప్‌కే జై కొట్టాయి. కేజ్రీవాల్‌కు హ్యాట్రిక్ కట్టబెట్టాయి.



    ఎగ్జిట్ పోల్స్ వివరాలు..





















































    పార్టీ పేరు టైమ్స్ నౌ - ఐపీఎస్ఓఎస్ రిపబ్లిక్ - జన్ కీ బాత్ న్యూస్ ఎక్స్ - నేతా ఏబీపీ - సీఓటర్ న్యూస్ ఎక్స్ పోల్ స్టార్ట్ ఇండియా టీవీ -Ipsos న్యూస్ 24 జన్‌కీ బాత్
    ఆమ్ ఆద్మీ పార్టీ 47 48-61  53-57 49- 63  50-56 44 54
    బీజేపీ 23 9-21 11-17 5- 19  10 -14 26 15
    కాంగ్రెస్ 0 0-1 0-2 0-4  0 0 1
    ఇతరులు 0 0 0 0  0 0 0

    డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు


    ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది సభ్యులు ఉంటారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా ఖాతా తెరవడం అనుమానమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

    ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 13,75 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. వీటిలో 3,141 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఇక సీఎం కేజ్రీవాల్ పోటిచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
    Published by:Janardhan V
    First published:February 11, 2020, 06:10 IST