ఢిల్లీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే.. ఎవరికి ఎన్ని సీట్లంటే.

ఎన్నికల ఫలితాల రోజే కేజ్రీవాల్ భార్య బర్త్ డే కావడం.. భారీ మెజార్టీతో గెలుపొందడంతో కేజ్రీవాల్ డబుల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఫలితాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ఐ లవ్ యూ ఢిల్లీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.


Updated: February 11, 2020, 9:00 PM IST
ఢిల్లీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే.. ఎవరికి ఎన్ని సీట్లంటే.
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు బయటకొచ్చాయి. మొత్తం 70 స్థానాల్లో ఆమాద్మీ పార్టీ (AAP) 62 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారం కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం 8 స్థానాలకే పరిమితమయైంది. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, బీఎస్పీ, వామపక్షాలకు చెందిన ఏ ఒక్కరూ గెలుపొందలేదు. ఆమాద్మీ పార్టీ 2015 ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలవగా.. ఈసారి 5 స్థానాలు తగ్గాయి. బీజేపీ గతంలో 3 సీట్లే గెలవగా.. ఈసారి మరో ఐదు స్థానాలు అదనంగా గెలచుకుంది.

ఎన్నికల ఫలితాల రోజే కేజ్రీవాల్ భార్య బర్త్ డే కావడం.. భారీ మెజార్టీతో గెలుపొందడంతో కేజ్రీవాల్ డబుల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఫలితాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ఐ లవ్ యూ ఢిల్లీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. సొంత కొడుకులా ఆదరించి మూడోసారి నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీ ద్వారా దేశంలో కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 14న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపడుతున్న కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీఎంకే నేత స్టాలిన్ అభినందనలు తెలిపారు.


ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ప్రదర్శన హాట్ టాపిక్‌గా మారింది. వరసగా రెండో అసెంబ్లీ ఎన్నికల్లోనూ సున్నాకే పరిమితమైంది. ఆ పార్టీ నుంచి కనీసం ఒక్కరు కూడా గెలవలేకపోయారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీ ఎన్నికల్లో కనివినీ ఎరుగని చెత్త ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున 66 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో ఏకంగా 63 మందికి డిపాజిట్లు దక్కలేదు. కేవలం ముగ్గురు మాత్రమే డిపాజిట్లు సాధించారు.
First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు