ఐ లవ్ యూ ఢిల్లీ.. గెలుపు తర్వాత కేజ్రీవాల్ ఫ్లయింగ్ కిస్

ఫలితాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ఐ లవ్ యూ ఢిల్లీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. సొంత కొడుకులా ఆదరించి మూడోసారి నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్.

news18-telugu
Updated: February 11, 2020, 4:24 PM IST
ఐ లవ్ యూ ఢిల్లీ.. గెలుపు తర్వాత కేజ్రీవాల్ ఫ్లయింగ్ కిస్
అరవింద్ కేజ్రీవాల్
  • Share this:
ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమాద్మీ పార్టీ సంబరాల్లో ముగినిపోయింది. భార్య పుట్టిన రోజు నాడే చిరస్మరణీయ గెలుపు అందుకున్న కేజ్రీవాల్.. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకుంటున్నారు. ఫలితాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ఐ లవ్ యూ ఢిల్లీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. సొంత కొడుకులా ఆదరించి మూడోసారి నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీ ద్వారా దేశంలో కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయని ఆయన అన్నారు.

దేశంలో కొత్త తరహా రాజకీయాలకు ఢిల్లీ జన్మనిచ్చింది. మూడోసారి ఆమాద్మీపై నమ్మకం ఉంచినందుకు ఢిల్లీ ప్రజలకు నా ధన్యవాదాలు. ఇది దేశ విజయం. ఇది నన్ను కొడుకుగా భావించి ఓటేసిన ప్రజల విజయం. ప్రజలకు మేం కల్పించిన సౌకర్యాలే మా విజయానికి బాటలు వేశాయి. విద్యుత్, నీటి సరఫరా,పౌరసేవలు, విద్యా, వైద్య కోసం చేసిన కృషి వల్లే ప్రజలు ఆదరించారు. మంగళవారం నాడు ఢిల్లీ ప్రజలను హనుమంతుడు ఆశీర్వదించారు. మరో ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేసేందుకు ఆ హనమంతుడు సన్మార్గాన్ని చూపిస్తాడని నమ్ముతున్నాం.
అరవింద్ కేజ్రీవాల్


70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమాద్మీ పార్టీ ఏకంగా 63 స్థానాలను గెలిచింది. గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక బీఎస్పీ,ఆర్జేడీ, వామపక్షాల వంటి పార్టీలకు నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా పడలేదు. కాగా, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా మూడోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు అరవింద్ కేజ్రీవాల్.
Published by: Shiva Kumar Addula
First published: February 11, 2020, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading