ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?

ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.

news18-telugu
Updated: January 6, 2020, 4:06 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?
ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.
  • Share this:
ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోడా ప్రకటించారు. దీనికి సంబంధించి జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు. ఢిల్లీలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సునీల్ అరోడా తెలిపారు. ఢిల్లీలో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 22తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగియనుంది. ఢిల్లీలో 13,767 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సునీల్ అరోడా తెలిపారు. ఎన్నికల కోసం 90వేల మంది పోలిస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలు ఇవే:
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: జనవరి 14

నామినేషన్ల దాఖలు ప్రారంభం: జనవరి 14
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: జనవరి 21


నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 24
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 8ఎన్నికల ఫలితాలు: ఫిబ్రవరి 11
First published: January 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు