200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.. సీఎం సంచలన హామీ

Arvind Kejriwal | మరో ఆరు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారీ హామీ ఇచ్చారు. అయితే, దీనిపై బీజేపీ పెదవి విరిచింది.

news18-telugu
Updated: August 1, 2019, 7:22 PM IST
200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.. సీఎం సంచలన హామీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 1, 2019, 7:22 PM IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన హామీ ఇచ్చారు. ఢిల్లీలో వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించారు. 201 నుంచి 400 యూనిట్ల వరకు 50 శాతం సబ్సిడీతో కరెంటు ఇస్తామన్నారు. దీని వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై రూ.1800 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. మరో ఆరు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి హామీతో ముందుకురావడం సంచలనంగా మారింది. దీంతోపాటు ప్రజలకు అవసరమైన అన్నిసేవలు ఉచితంగా అందిస్తామని కూడా కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 2017లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయం సాధించింది. 70 స్థానాల్లో 67 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ కూడా ఓటమి పాలయ్యారు. అయితే, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. గత ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని.. అందులో అమలు చేయనివి చాలా ఉన్నాయని ఆరోపించింది. ఈ హామీ కూడా అమలు కాని వాటి జాబితాలో చేరిపోతుందని బీజేపీ నేతలు ఆరోపించారు.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...