DELHI CM ARVIND KEJRIWAL ACCCEPTS AUTO DRIVERS DINNER AND GOES IN AUTO NGS
CM Dinner Auto Driver: సామాన్యుడి ఆహ్వానంపై స్పందించిన సీఎం.. ఆటోలో ఇంటికి వెళ్లి భోజనం.. వైరల్ గా మారిన వీడియో
ఆటో డ్రైవర్ ఇంట్లో సీఎం భోజనం
CM Dinner Auto Driver: అతనో సామాన్య ఆటో డ్రైవర్.. కానీ సీఎం అంటే అమితాభిమానం.. దీంతో ఓ బహిరంగ సమావేశానికి వచ్చిన సీఎంను.. ఓ కోరిక కోరాడు.. మా ఇంటికి భోజనానికి రావాలి సార్ అని సరదాగా కోరాడు.. కానీ సామాన్యుడి ఆహ్వానాన్ని మన్నించిన సీఎం.. నేరుగా ఆ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి భోజనం చేశారు.
Delhi CM Arvind Kejriwal ate dinner at auto driver house: సీఎం అయినా తాను సామాన్యుడినే అంటున్నారు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. సమాజంలో పేదా- గొప్పా అనే తారతమ్యాలు ఏమీ లేవని చాటి చెప్పారు. సాధరణంగా ఓ ప్రముకుడు.. పేద వాడి కుటుంబాన్ని కలిస్తేనే పెద్ద వార్త అవుతుంది. అలాంటి సమయంలో ఓ ముఖ్యమంత్రి (Chief Minster) అయ్యి ఉండి.. అది కూడా సామాన్యుడి సరదాగా ఆహ్వానిస్తే.. అతడి కోరికను నిజం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) తన ఇంటికి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానానికి సీఎం కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించారు. ఏదో మాట వరసకు ఊ కొట్టడం కాదు.. అతడి ఆటోలోనే వెళ్లి.. అతడి కుటుంబంతో కలిసి ఇంటి నేలపై కూర్చుని కలిసి భోజనం చేశారు (Dinner at auto driver house). అయితే ఈ ఘటన జరిగింది ఢిల్లీలో కాదు..పంజాబ్ (Punjab) లో.. తాను సరదగాగా పిలిస్తే సీఎం నిజంగా రావడంతో సామాన్యుడి ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి.
ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ పంజాబ్లో లూధియానాలో పర్యటిస్తున్నారు. మరికొద్ది నెలల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేజ్రీవాల్ లూథియానాలోని ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సమయంలో దిలీప్ తివారీ అనే ఓ ఆటోడ్రైవర్ మైక్ తీసుకుని..సీఎంతో మాట్లాడుతు.. ‘‘సీఎంగారూ.. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఆటోడ్రైవర్లకు సహాయం చేశారు. అందుకు ధన్యవాదాలు.. అయితే నాది ఒక చిన్న కోరిక మన్నిస్తారని కోరుతున్నా అన్నాడు. మన్నించండి అంటూ చెప్పాడు. దానికి కేజ్రీవాల్ చెప్పు అంటూ నవ్వుతు అడిగారు. వెంటనే దిలీప్ తివారీ కాస్త ఇబ్బంది పడుతూనే.. ‘సీఎం గారూ..ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజనానికి రాగలరా? నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా అని మనసులో మాట చెప్పాడు.
వెంటనే నవ్వుతూనే సీఎం సమాధానం చెప్పారు. ఇంత ప్రేమగా పిలిస్తే ఎందుకు రాను అని సమాధానం ఇచ్చారు. అంతే కాదు ఈ రాత్రికి వస్తే అభ్యంతరమా అని అడిగారు. దాంతో సంబరపడ్డ దిలీప్ ఆనంద బాష్పాలతో సంతోషం వ్యక్తం చేశాడు. అయితే దానికి కేజ్రీవాల్ ‘మరి నాతో పాటు ఇంకెవరన్నా రావచ్చా అని అడిగారు.దానికి దిలీప్ తప్పకుండా సార్ ఆనందంగా తలూపాడు. దీంత కేజ్రీవాల్ తనతో పాటు భగవంత్ మన్, హర్పాల్ సింగ్ లు కలిసి ఆటోవాలా ఇంటికెళ్లి భోజనం చేశారు. అది కూడా అతడి ఆటోలోనే...
ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. తరువాత అక్కడి వారితో కాసేపు సరదగా గడిపారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విటర్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆటోవాలా కుటుంబం మాపై చూపించిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడినయ్యానని..భోజనం చాలా బాగుందని తెలిపారు. ఆటోడ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.