news18-telugu
Updated: February 16, 2020, 1:22 PM IST
అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎంగా ముచ్చటగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రాంలీల మైదానంలో జరిగిన ఈ వేడుకకు వేలాది సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. భారీగా వచ్చిన జనం మధ్యలో కేజ్రీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముందు నుంచి అనుకున్నట్లుగానే కేజ్రీవాల్ తిరిగి పాత మంత్రులనే తన కేబినెట్లోకి తీసుకున్నారు. మనీష్ సిసోడియా, గోపాల్ రాయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై, మీ బిడ్డను ఆశీర్వదించండంటూ దిల్లీ వాసులకు శనివారం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాంలీల మైదానంమంతా కేజ్రీవాల్ నామస్మరణతో మారుమోగింది.
మరోవైపు ప్రమాణ స్వీకారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన స్పెషాలిటీ చూపించారు. హమ్ హోంగే కామియాబ్ అనే దేశ భక్తి పాటను పాడారు కేజ్రీ. తనతో పాటు... మైదానంలో ఉన్న ప్రజలంతా కేజ్రీతో గొంతు కలిపారు. ఇలా ఏ రెండు లైన్లు కాదు... మొత్తం పాట పాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉద్వేగంతో పాడిన పాటకు... అక్కడున్న వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు అభిమానులు ఆయనతో కలిసి పాడారు. మూడోసారి కేజ్రీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
February 16, 2020, 1:21 PM IST