ఢిల్లీ ఎన్నికల్లో 54 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ 54 మంది పేర్లతో జాబితాను విడుదల చేశారు.

news18-telugu
Updated: January 18, 2020, 9:31 PM IST
ఢిల్లీ ఎన్నికల్లో 54 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ 54 మంది పేర్లతో జాబితాను విడుదల చేశారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ శాసనసభకు ఈనెల 6న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 14న నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 21తో నామినేషన్లు వేయడానికి గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా 54 మందితో జాబితాను విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. అయితే, ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 70 అసెంబ్లీ సీట్లకు గాను 67 స్థానాల్లో జయభేరి మోగించింది. బీజేపీ నుంచి ముగ్గురు గెలిచారు. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019 ఏప్రిల్ - మే నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ జోష్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో బీజేపీ ప్రకటించలేదు. అంతా ప్రధాని మోదీ మీదే భారం వేశారు. మరోవైపు అధికార ఆప్ ప్రజలకు వరాల మీద వరాలు కురిపిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ టికెట్లు తమకు ఇవ్వాలంటూ చాలా మంది ఆశావహులు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 18, 2020, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading