Delhi Elections: నేడే పోలింగ్.. ఢిల్లీ ఎన్నికలకు ఏర్పాటు పూర్తి

ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 13,75 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. వీటిలో 3,141 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన పోలీసులు..ఆయా కేంద్రాలపై ప్రత్యేక నిఘాపెట్టారు.


Updated: February 8, 2020, 1:46 AM IST
Delhi Elections: నేడే పోలింగ్.. ఢిల్లీ ఎన్నికలకు ఏర్పాటు పూర్తి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో శనివారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల ముగుస్తుంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం సహా పోలింగ్ సామాగ్రి మొత్తం ఆయా కేంద్రాలకు చేరుకుంది. మొత్తం 60వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోటి 47లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 13,75 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. వీటిలో 3,141 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన పోలీసులు..ఆయా కేంద్రాలపై ప్రత్యేక నిఘాపెట్టారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఇక సీఎం కేజ్రీవాల్ పోటిచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

First published: February 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు