ఢిల్లీలో ఆమాద్మీ విజయంపై ప్రశాంత్ కిశోర్ రియాక్షన్ ఇదే

జ్రీవాల్ తీన్మార్ గెలుపుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త స్పందించారు. ఆమాద్మీకి భారీ విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Updated: February 11, 2020, 3:45 PM IST
ఢిల్లీలో ఆమాద్మీ విజయంపై ప్రశాంత్ కిశోర్ రియాక్షన్ ఇదే
కేజ్రీవాల్‌ను కలిసిన ప్రశాంత్ కిశోర్
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించిన ఆమాద్మీని ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ తీన్మార్ గెలుపుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త స్పందించారు. ఆమాద్మీకి భారీ విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

భారత దేశ ఆత్మను కాపాడేందుకు అండగా నిలబడిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు.
ప్రశాంత్ కిశోర్
అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన కేజ్రీవాల్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీప్‌ స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమాద్మీ 63 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కేవలం ఏడింటికే పరిమితమైంది. కాంగ్రెస్, బీఎస్పీ, బీజేడీ, వామపక్షాలు కనీసం ఖాతా తెరవలేదు.

First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు